twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Disha: శంషాబాద్ ఏసీపీతో రామ్ గోపాల్ వర్మ మీట్.. అందుకే వచ్చానంటూ కామెంట్స్

    |

    తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది 'దిశ' ఘటన. హైదరాబాద్‌కి చెందిన వెటర్నరీ డాక్టర్‌ని మాయమాటలు చెప్పి అత్యంత పాశవికంగా రేప్ చేసి చంపేశారు. ఈ ఉదంతం గురించి తెలిసి ప్రపంచమంతా నిర్ఘాంతపోయింది. దిశ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. సీన్ రీ క్రియేషన్ చేస్తుండగా.. వాళ్ళు పారిపోబోయే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారిని ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ ఇష్యూకి ఫుల్‌స్టాప్ పడింది.

     వర్మ స్టేట్‌మెంట్.. దిశ మూవీ

    వర్మ స్టేట్‌మెంట్.. దిశ మూవీ

    అయితే ఈ సబ్జెక్టును కథగా తీసుకొని తాను సినిమా రూపొందిస్తానని ఇటీవలే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. తన తర్వాతి సినిమా పేరు ‘దిశ' అని, దిశ రేప్ ఘటన గురించి ఈ సినిమా ఉండబోతోందని తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అందరి చూపు వర్మ తీయబోతున్న 'దిశ' మూవీపై పడింది.

    రేపిస్ట్‌ భార్యను విచారించిన వర్మ

    రేపిస్ట్‌ భార్యను విచారించిన వర్మ

    ఈ నేపథ్యంలో దిశ ఘటనలో నిందితులు, ఆ ఘటన జరిగిన తీరు, ఎన్‌కౌంటర్ అన్ని అంశాలపై ఆరాదీయడం స్టార్ట్ చేశారు వర్మ. ఇందులో భాగంగా రేపిస్ట్‌లలో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను ఇటీవలే వర్మ కలిసిన సంగతి తెలిసిందే. ఆమెను తన ఆఫీస్‌కు పిలిపించి చెన్నకేశవులుకు సంబంధించిన కీలక విషయాలు అడిగి తెలుసుకున్నారు వర్మ.

    దిశనే కాదు.. ఆమెనూ మోసం చేశాడు

    దిశనే కాదు.. ఆమెనూ మోసం చేశాడు

    పదహారేళ్ల వయసులోనే రేణుక చెన్నకేశవులును పెళ్లి చేసుకుందని, 17 ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందని ఆమెను కలిసిన తర్వాత వర్మ వెల్లడించాడు. దిశనే కాదు ఆ రాక్షసుడు రేణుకను కూడా మోసం చేశాడని.. రేణుక ఇంకా చిన్న పిల్ల అని అన్నాడు వర్మ. ఆమెకు, ఆమెకు పుట్టబోయే బిడ్డకు భవిష్యత్తు లేదని వర్మ తెలిపారు.

    శంషాబాద్ ఏసీపీతో వర్మ మీట్.. అందుకే

    శంషాబాద్ ఏసీపీతో వర్మ మీట్.. అందుకే

    ఇకపోతే దిశ ఘటన తాలూకు వివరాలు సమగ్రంగా తెలుసుకోవడంలో భాగంగా.. తాజాగా శంషాబాద్ ఏసీపీని కలిశాడు వర్మ. ఈ మేరకు దిశ ఘటన తాలూకు విషయాలు అడిగి తెలుసుకున్నాడు. దిశ ఘటన గురించి తెలుసుకునేందుకే ఏసీపీని కలిశానని వర్మ తెలిపాడు.

    Recommended Video

    Ram Gopal Varma Exclusive Interview About Beautiful Movie
    ఎవ్వరి అనుమతి అవరసం లేదు

    ఎవ్వరి అనుమతి అవరసం లేదు

    దిశ మూవీ తీసేందుకు ఎవ్వరి అనుమతి అవరసం లేదని ఈ సందర్భంగా వర్మ చెప్పాడు. కుటుంబ సభ్యుల అనుమతి కూడా అవరసం లేదని ఆయన పేర్కొన్నాడు. త్వరలోనే మరికొందరిని కలిసి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుంటానని వర్మ చెప్పాడు.

    English summary
    The four accused in brutal rape and murder of veterinary doctor Disha have been encountered by Shamshabad police. Now Ram Gopal Varma meets Shamshabad ACP to know the details of Disha issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X