మురళీమోహన్ కౌగిలిలో అందమైన హీరోయిన్.. అందుకే ఆయనంటే ద్వేషం.. ఆర్జీవి కామెంట్స్ వైరల్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏదైనా మాట్లాడితే దానికి చాలా పరమార్థాలు ఉంటాయి. సెటైరికల్‌గా ఆయన మాట్లాడే మాటలు కొన్ని సార్లు వివాదంగా మారుతాయి. మరికొన్ని సార్లు కొందరికి ఇబ్బందికి కరంగా ఉంటాయి. కానీ ఆర్జీవి మాత్రం తనదైన శైలిలో మాట్లాడటం మాత్రం ఆపడం మాత్రం చేయరు. తాజాగా ఆయన చేసిన ప్రసంగం కూడా అలాంటి పరిస్థితిని ఎదుటి వారికి కలుగజేస్తుంది. ఆర్జీవి వదలిన మాటల గురించి వెళితే..

రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలోనే కాదు..డైరెక్టుగా ఈవెంట్ వేదికలు, ఇంటర్వ్యూలలో ఏదీ దాచుకోడు. మనసులో ఏది ఉంటే.. అదే మాట్లాడేస్తుంటాడు. ఎవరు ఏమనుకొంటారనే ప్రసక్తే ఉండదు. ఆయన చెప్పాల్సి చెప్పేస్తాడనే పేరు వర్మకు ఉంది.

Ram Gopal Varma mocks Murali Mohan hugging Jayasudha at Revu Party Event

ఇక తాజాగా నిర్వహించిన రేవు పార్టీ ఈవెంట్‌లో వర్మ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్, జయసుధ గురించి చెప్పిన విషయాలు ఫన్నీగా ఉండటమే కాకుండా అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాయి.

రేవు పార్టీ సినిమా ఈవెంట్‌కు వచ్చిన మురళీ మోహన్ గారి గురించి ఓ మాట చెప్పాలి. ఆయన మంచికి మారు పేరు అయితే నేను చెడుకు మారు పేరు. ఆయనను ఒక విషయంలో నేను బాగా ద్వేషించేవాడిని అంటూ వర్మ తనదైన శైలిలో మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఎలాంటి సెన్సేషన్ లేకుండా సాగిన ఈవెంట్ ఒక్కసారిగా వైబ్రెంట్ అయింది.

నాకు ఇష్టమైన హీరోయిన్లలో జయసుధ ఒకరు. జ్యోతి సినిమాలో నా ఫేవరేట్ హీరోయిన్ జయసుధ ఆయన ఒడిలో ఉండేది. ఆ సీన్ చూసి కోపంగా థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయేవాడిని. అందుకే మురళీ మోహన్ గారంటే నాకు కోపం. అయితే ఆయన లాంటి నాన్ కాంట్రవర్శియల్ పర్సన్‌ను నా లైఫ్‌లో చూడలేదు అని వర్మ అన్నారు. దాంతో మురళీ మోహన్‌తోపాటు స్టేజ్ అంతా నవ్వులతో మునిగిపోయింది.

గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు నటీనటులు ఈ చిత్రంలో నటించారు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరగగా ఆర్జీవి, అనన్య నాగళ్ల, మురళీమోహన్, సంపతి నంది తదితరులు హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X