Don't Miss!
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా కొడుకు ఇచ్చిన గిఫ్ట్ ఇదే: రామ్ గోపాల్ వర్మ తల్లి ఎమోషనల్ స్పీచ్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో 'కోబ్రా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నటుడిగా తెరంగ్రేటం చేస్తున్నారు ఆర్జీవీ. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ ఆర్జీవీ పుట్టినరోజు(ఏప్రిల్ 7) సందర్భంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్‌గా మాట్లాడారు. 'నేనెప్పుడూ మా రామూని ఒక వేషం వేయమని అడుగుతుంటాను. మంచి మెచ్యూర్డ్ క్యారెక్టర్ వేయమని కోరేదాన్ని. కంపెనీలో అజయ్ దేవగన్ లాంటి పాత్ర వేయాలని అడిగితే ఏం మాట్లాడేవాడు కాదు. చాలా సార్లు అడిగి అడిగి ఊరుకున్నాను.' అని ఆమె గుర్తు చేసుకున్నారు.
నా కొడుకు గిఫ్ట్ ఇచ్చాడు, నేనే ఫస్ట్ పర్సన్
‘‘నా కోరిక తీర్చేందుకు రామూ ఇప్పటికైనా సినిమాల్లో నటించడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను తనకు గిఫ్ట్ ఇచ్చే బదులు తనే నాకు ఇచ్చాడు. ఇలాంటి గిఫ్ట్ ఏ తల్లీ పొంది ఉండదు. ఏ కొడుకూ ఏ తల్లికీ ఇచ్చి ఉండరు.. నేనే ఫస్ట్ ఫర్సన్ కావచ్చేమో'' అని సూర్యమ్మ వ్యాఖ్యానించారు.
కత్తితో కసా కసా పొడిచిన వర్మ
తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ఆర్జీవీ రోటీన్‌కు భిన్నంగా ప్రవర్తించాడు. తనలోని విలనిజాన్ని ప్రదర్శిస్తూ కత్తితో కేక్‌ను కసా కసా పొడిచి ముక్కలు చేశాడు. అనంతరం మర్డర్ చేసిన లెవల్లో హావ భావాలు పలికిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
‘కోబ్రా' ఫస్ట్ లుక్: నా మొహం చూసి నవ్వొద్దు.. ఏడ్చేస్తానన్న రామ్ గోపాల్ వర్మ
తనకు పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం లేదంటూనే..
బర్త్ డే అంటే నాకు చిరారు. అది వచ్చినప్పుడల్లా సంవత్సరం ఓల్డ్ అయిపోతున్నామనే భయం, ఒక సంవత్సరం చావుకు దగ్గర అవుతున్నామనే ఫీలింగ్ నాకు ఉంటుంది. వయసుపై, ప్రపంచంలో లక్షలు, కోట్ల మంది పుడతా ఉంటారు. దాంతో పాటు క్రిములు, జంతువులు పుడతాయి. మనం పుట్టిన తర్వాత ఏదైనా సాధిస్తే.. ఆ సాధించిన రోజు సెలబ్రేట్ చేసుకోవడంలో ఎక్కువ అర్థం ఉంది. అయితే ఈ పుట్టినరోజు వేడుక నా కోసం కాకుండా నా వాళ్ల సంతృప్తి కోసం జరుపుకుంటున్నట్లు వర్మ చెప్పుకొచ్చారు.
కోబ్రా
కోబ్రా చిత్రానికి రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్జీవీ గన్ షాట్ ఫిల్మ్స్ పతాకంపై డిపీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో కెజి అనే నటుడు క్రిమినల్ పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో రంగారావు, ఇంటిలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ ఆర్ పాత్రలో రామ్ గోపాల్ వర్మ నటిస్తున్నారు.