For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ వల్ల శాంతి భద్రతల సమస్యా? కోర్టుకు వెళుతున్న ఆర్జీవీ

|

ఏపీలో ఎన్నికలు ముగిశాయి కాబట్టి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మే 1న రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఎలక్షన్ కోడ్ అమలులో ఉందని పేర్కొంటూ ఎన్నికల సంఘం(ఈసీ) సినిమా రిలీజ్ మరోసారి ఆపివేయడంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు.

వాస్తవానికి ఈ చిత్రం మార్చి 29న విడుదల కావాల్సింది. అయితే ఏపీలో ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలపై ఈ మూవీ ప్రభావం చూపే అవకాశం ఉందనే కోర్టు వివాదం కారణంగా రిలీజ్ నిలిపివేశారు. అప్పట్లో ఈ విషయమై వర్మ అండ్ టీం సుప్రీం కోర్టుకు వెళ్లినా అక్కడ కూడా చుక్కెదురైన సంగతి తెలిసిందే.

ఈసీ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది

‘‘హైకోర్టు జడ్జిమెంటులోని ‘8 సి' అనే పాయింటుకు లోబడి మే 1న రిలీజ్ ప్లాన్ చేశాం. కానీ ఈసీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఈ విషయంపై మేము హైకోర్టును సంప్రదించాలనుకుంటున్నాం. సినిమా ఆపడం వెనక ఎవరు ఉన్నారనేది మనందరికీ తెలుసు'' అని వర్మ ట్వీట్ చేశారు.

శాంతి భద్రతల సమస్య వస్తుందట

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఏపీలోని అన్ని థియేటర్ల నుంచి తీసేశారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని అధికారుల ఆదేశాల మేరకే ఇలా చేశారట. సెన్సార్ సర్టిఫికెట్, హైకోర్టు క్లియరింగ్ ఉన్నప్పటికీ ఇలా చేయడం దారుణం... అంటూ వర్మ పేర్కొన్నారు. ఈ చిత్రం ఏపీ ప్రజల్లోకి వెళ్లకుండా కావాలనే ఆపుతున్నారంటూ వర్మ మండి పడ్డారు.

ముందు నుంచీ వివాదాల్లో

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ముందు నుంచీ వివాదాల్లోనే ఉంది. ఈ చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విలన్‌గా, వెన్నుపోటుదారుడిగా చూపించారనే వాదన తెరపైకి రావడంతో తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. ఇప్పటికే కొందరు ఈ మూవీపై కేసులు వేసిన సంగతి తెలిసిందే.

లక్ష్మీస్ ఎన్టీఆర్

ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' తెరకెక్కింది. ఇందులో రామారావు కుటుంబాన్ని, అల్లుడు చంద్రబాబును నెగెటివ్‌గా. లక్ష్మీ పార్వతి పాత్రను పాజిటివ్‌గా చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో మినహా తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ మూవీ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రాకేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఆర్జీవీ, అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. రామారావు పాత్రలో విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞశెట్టి నటించారు.

English summary
"Point 8C in EC ‘s below letter combined with AP high court judgement is why we planned release today. we going to court against contradictory stand of EC now to stop film after giving permission to release for reasons best known to it and we all know the force behind responsible." RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more