నా మైండ్ దొబ్బింది.. కానీ జ్యూస్ అయిపోలేదు.. రాంగోపాల్ వర్మ

శివ వచ్చిన 28 ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ కింగ్ నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయింది.

By Rajababu

Recommended Video

నేను దేవుణ్ణి నమ్మను.. నాగార్జునని నమ్ముతా !

శివ వచ్చిన 28 ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ కింగ్ నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయింది. అన్నపూర్ణ స్టూడియోలో శివ సినిమా ముహూర్తం షాట్‌ కొట్టిన ప్రదేశంలోనే నాగ్, వర్మ చిత్రం ఓపెనింగ్ షాట్‌ను కొట్టడం విశేషం. ఈ కార్యక్రమానికి శివ చిత్రంలో నటించిన నటీనటులు హాజరయ్యారు. ఈ సెన్సేషనల్ మూవీ ప్రారంభానికి పెద్ద మొత్తంలో మీడియా, అభిమానులు, సినీ ప్రముఖులు తరలి రావడంతో అన్నపూర్ణ స్టూడియో సందడిగా మారింది.

 వర్మ తల్లి చేతుల మీదుగా

వర్మ తల్లి చేతుల మీదుగా

శివ చిత్రానికి రాంగోపాల్ వర్మ తండ్రి ముహుర్తం షాట్‌కు క్లాప్ కొట్టగా, ఈ చిత్రానికి ఆయన (ఆర్జీవి) తల్లి ఓపెనింగ్ షాట్‌కు హాజరయ్యారు. ముహుర్తం షాట్ సందర్భంగా తొలి సన్నివేశంలో నాగార్జున చెప్పిన డైలాగ్ సింగిల్ టేక్‌లో ఓకే అయింది.

నాగార్జున ఫస్ట్ డైలాగ్

నాగార్జున ఫస్ట్ డైలాగ్

‘నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన చెప్పకపోయినా నీవు చావడం మాత్రం ఖాయం. త్వరగా సమాధానం చెప్పి ముందు చస్తావో.. ఎక్కువ బాధపడి లేటుగా చస్తావో అది నీ ఇష్టం. ఏది కావాలో ఎంచుకో (చూస్) అని నాగార్జున డైలాగ్ చెప్పారు.

 28 ఏళ్ల క్రితం ఇక్కడే శివ

28 ఏళ్ల క్రితం ఇక్కడే శివ

ముహుర్తం షాట్‌ అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వర్మ, నాగార్జున మాట్లాడారు. వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు భావోద్వేగంతో కూడుకున్నది. 28 ఏళ్ల క్రితం ఇక్కడే శివ ప్రారంభమైంది.

 అన్నపూర్ణ స్టూడియో నాకు సొంత ఇల్లు

అన్నపూర్ణ స్టూడియో నాకు సొంత ఇల్లు

నేను తిరిగిన, పెరిగిన అన్నపూర్ణ స్టూడియోలోనే నా తొలి చిత్రం ప్రారంభం కావడం నా అదృష్టం. నా ఇంటి కంటే ఎక్కువ అన్నపూర్ణ స్టూడియోను ఆరాధిస్తాను. నిజంగా నా ఇల్లు అని భావిస్తాను అని అన్నారు.

 మైండ్ దొబ్బిందని ఎగతాళి

మైండ్ దొబ్బిందని ఎగతాళి

చాలా కాలంలో సోషల్ మీడియాలో అనవసరపు ప్రేలాపనలతో టైంపాస్ చేశాను. ఆ సందర్భంగా అందరూ నా మైండ్ దొబ్బింది. వర్మలో జ్యూస్ (సత్తా) అయిపోయింది అని ఎగతాళి చేశారు. ఆ సమయంలో పెద్దగా సినిమాలు చేయలేదు.

జ్యూస్ అయిపోలేదు..

జ్యూస్ అయిపోలేదు..

అందరూ అనుకొన్నట్టు నాకు మైండ్ దొబ్బిన మాట వాస్తవమే. కానీ జ్యూస్ అయిపోయిందో లేదో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చెబుతుంది.

 దేవుడిని కాదు.. నాగ్‌ను నమ్ముతా

దేవుడిని కాదు.. నాగ్‌ను నమ్ముతా

నేను దేవుడిని నమ్మను కానీ నాగార్జున నమ్ముతాను. శివకు ముందు ఎలాంటి అనుభవం లేని వారికి డైరెక్షన్ చాయిస్ ఇవ్వడం చాలా అరుదు. కానీ నాలో ఉండే ఇంటెన్సిటిని, నాపై ఉన్న నమ్మకంతో నాగార్జున నాకు అవకాశం ఇచ్చాడు.

 శివ చిత్రానికి తర్వాతే

శివ చిత్రానికి తర్వాతే

శివకు ముందు నేను ఎవరో తెలియదు. శివ రిలీజ్ అయిన తర్వాతనే రాంగోపాల్ వర్మ అంటే ప్రపంచానికి తెలిసింది. టాలెంట్ ఉన్న దర్శకుడు అని రుజువు అయింది అని వర్మ అన్నారు.

 ముహూర్తం షాట్‌కు పూరీ తదితరులు

ముహూర్తం షాట్‌కు పూరీ తదితరులు

వర్మ, నాగార్జున చిత్ర ప్రారంభోత్సవానికి పూరీ జగన్నాథ్, శివనాగేశ్వర్ రావు, జేడీ చక్రవర్తి, ఉత్తేజ్, నిర్మాత వై సురేంద్ర, వెంకట్ అక్కినేని తదితరులు హాజరయ్యారు. వీరంతా శివ చిత్రంతో అనుబంధం ఉన్న వారన్న సంగతి తెలిసిందే.

నాగ్ స్వేచ్ఛ ఇచ్చాడు

నాగ్ స్వేచ్ఛ ఇచ్చాడు

టాలెంట్ ఉన్నా స్వేచ్ఛ ఇవ్వకపోతే ఎవరూ రాణించలేదు. శివ విషయంలో నాగార్జున నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే అంతమంచి ప్రొడక్ట్ వచ్చింది. సినిమా కథ తెర మీద అద్భుతంగా రావడానికి అనేక మంది కష్టపడుతారు. సినిమా విషయంలో ఎవరి మాట వినను. అందుకే మూర్ణుడు అంటారు.

పాత వర్మను చూస్తారు

పాత వర్మను చూస్తారు

తాజా సినిమా కథ చెప్పినప్పుడు నాగార్జున చాలా ఎక్సైటింగ్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ కథ బాగా చెప్పాడు. మళ్లీ పాత వర్మను చూస్తారు అని చెప్పడం నాపై నాకు మరింత విశ్వాసం కలిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X