పవన్ కల్యాణ్‌కు సారీ చెప్పిన రాంగోపాల్ వర్మ.. శ్రీరెడ్డి చేత నేనే తిట్టించా!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తోపాటు అతడి తల్లిని నటి శ్రీరెడ్డి దూషించడం టాలీవుడ్‌లో అత్యంత వివాదంగా మారింది. అయితే శ్రీరెడ్డి చేత తిట్టించడానికి కారణం తానే అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒప్పుకోవడం ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది.
ఇటీవల ఓ ఇంటర్య్యూలో వర్మమ మాట్లాడుతూ.. నేను ప్రోత్సహించడం వల్లనే పవన్ కళ్యాణ్‌ను శ్రీరెడ్డి దూషించింది. నా కారణంగా అలా తిట్టింది. అది ఆ అమ్మాయి ఐడియా కాదు. ఈ విషయంలో ఎవరికైనా సారీ చెప్పాల్సిన అవసరం ఉంటే అది నేను. నేను ఆ మాట అనక పోయినా నా మూలాన శ్రీరెడ్డి ఇన్ ఫ్యూయెన్స్ అయింది కాబట్టి అలా ప్రవర్తించింది... అని వర్మ తెలిపారు.
ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్‌కు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. మరోసారి నేను సిన్సియర్‌గా పవన్ కల్యాణ్‌కు, ఆయన ఫ్యాన్స్‌కు, అతడి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నాను అని ఓ పోస్టులో పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications











