ప్రభాస్ సినిమాపై రాంగోపాల్ వర్మ పజిల్.. కరెక్టుగా చెప్తే లక్ష రూపాయలు మీవేనట

తెలుగు సినిమా రేంజ్ ఏ మేర పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో వస్తున్న టాలీవుడ్ సినిమాలే దీనికి ఉదాహరణ. అదే సమయంలో మన హీరోల స్థాయి కూడా భారీగానే పెరిగింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఒక్క హీరో వరల్డ్ వైడ్‌గా ఫోకస్ అవుతున్నాడు. అతడే రెబెల్ స్టార్ ప్రభాస్. కొంత కాలంగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోన్న అతడు.. సినిమా సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటూనే వెళ్తున్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాను చేశాడు. తాజాగా ఈ చిత్రంపై రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశాడు. ఆ వివరాలు మీకోసమే!

'సలార్: సీజ్‌ఫైర్' సక్సెస్‌తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసిన రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు పలు ప్రాజెక్టులను చేస్తున్నాడు. అందులో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' ఒకటి. ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని పాన్ వరల్డ్ రేంజ్‌లో తీశారు.

Ram Gopal Varma Mystery Tweet On Prabhas Starrer Kalki 2898 AD Movie

టైం ట్రావెల్ కాన్సెప్టుతో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' సినిమాను అత్యధిక బడ్జెట్‌తో రూపొందించారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం కంప్లీట్ చేసుకున్నారు. ఇలా ఈ సినిమాకు సంబంధించిన హడావిడి దాదాపు ఐదారు నెలలుగా కనిపిస్తూనే ఉంది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాను జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభిస్తోంది.

'కల్కి 2898 ఏడీ' సినిమా రిలీజ్ ట్రైలర్‌ను రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అంతేకాదు, దీనికి ఓ కామెంట్ కూడా జోడించాడు. అయితే, ఇందులో ఇంగ్లీష్‌లో కొన్ని పదాలకు గ్యాప్ ఇచ్చి.. దాన్ని పూరించమని చెప్పాడు. అదే సమయంలో ఆ పూర్తి వాఖ్యాన్ని ఎవరైతే కరెక్టుగా జోడిస్తారో వాళ్లకు లక్ష రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఆర్జీవీ ట్వీట్ సెన్సేషన్ అవుతోంది.

Ram Gopal Varma Mystery Tweet On Prabhas Starrer Kalki 2898 AD Movie

ఇదిలా ఉండగా.. పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్ 'కల్కి 2898 ఏడీ' మూవీలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, మాళవిక నాయర్‌లు ముఖ్యమైన పాత్రలు చేశారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X