NNN twitter Review: నగ్నం సినిమాను ఎంతమంది చూశారంటే?
కరోనా దెబ్బకు దర్శకులంతా సినిమాలు ఎలా తీయాలి అని తల బాదుకుంటూ ఉంటే వర్మ మాత్రం కూల్ గా రెండు సినిమాలను వదిలాడు. వాటిని సినిమాలు అంటారా.. అనే కామెంట్స్ కూడా వస్తున్నప్పటికీ ఎదో ఒక విధంగా అయితే షూటింగ్ విజయవంతంగా పూర్తి చేశాడు కదా.. అని వర్మ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నేకిడ్ అంటూ మరో అడల్ట్ సినిమాను వదిలిన వర్మ ఓ వర్గం ఆడియెన్స్ ని మొదట బాగానే ఎట్రాక్ట్ చేశాడు. ఇక ట్విట్టర్ హడావిడిపై ఒక లుక్కేస్తే..
డోస్ పెంచాడు కానీ..
వైవిధ్యమైన బోల్డ్ సినిమాలను వదులుతూ హాట్ టాపిక్ గా నిలుస్తున్న వర్మ మొన్న మియా మాల్కోవాతో క్లైమాక్స్ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి లోకల్ లేడితో మసాలా డోస్ ఇంకాస్త పెంచేశాడు. NNN సినిమాలో ఏ మాత్రం కథ లేదని వర్మ రోజురోజుకి తన బ్రాండ్ ని ఇలాంటి సినిమాలతో తగ్గించుకుంటున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
స్కిన్ షో తప్పితే..
వర్మ ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయడంలో చాలానే శ్రమించాడు. గ్యాప్ లేకుండా హాట్ ఫొటోస్ వధలడమే కాకుండా మధ్యలో మర్డర్ సినిమా పోస్టర్స్ వదిలి అలాగే NNN పోస్టర్స్ తో కూడా తన ట్వీట్స్ హైలెట్ అయ్యేలా ఎట్రాక్ట్ చేశాడు. అయితే స్కిన్ షో తప్పితే ఇందులో పెద్దగా ఆకర్షించే అంశాలు ఏమి లేవని ట్వీట్స్ వస్తున్నాయి.
ఎంత మంది చూశారంటే..
వర్మ చేసిన ట్వీట్ ప్రకారం కొన్ని గంటల క్రితం సినిమాకు 29,609 వ్యూవ్స్ వచ్చినట్లు ఒక పోస్టర్ వదిలాడు. ఇంకా కౌంటింగ్ నడుస్తూనే ఉందని చెబుతున్నారు. కానీ సోషల్ మీడియాలో వర్మ ట్వీట్స్ తప్పితే నెటీజన్స్ పెద్దగా స్పందించడం లేదు. ఇక ఈ సినిమాకు వర్మ ఒక వ్యూవ్ కి 200 రూపాయల ధరను నిర్ణయించారు.
Recommended Video

నెక్స్ట్ మరో కాంట్రవర్సీ మర్డర్..
రామ్ గోపాల్ వర్మ అనే బ్రాండ్ మీద ఆయన అభిమానులకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే వర్మ మాత్రం ఇలాంటి బూతు సినిమాలను ఎంచుకొని ఆయన స్థాయిని ఇంకా తగ్గించుకుంటున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. క్లయిమ్యాక్స్, నేకెడ్ కాన్సెప్ట్ ల హడావిడి తరువాత మర్డర్ అనే మరో కాన్సెప్ట్ తో రానున్న వర్మ ఆ సినిమాతో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











