ఓవర్‌‌నైట్‌లో ఆ హీరోయిన్ జీవితాన్నే మార్చేశాడు.. వర్మనా మజాకా?

రామ్ గోపాల్ వర్మ అంటే పబ్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారని ఇప్పటికే జనాలకు ఒక బలమైన క్లారిటీ వచ్చేసింది. ఎలాంటి విషయంపై అయినా సరే తనదైన శైలిలో స్పంధించే వర్మ ఈ కరోనా కలికాలంలో మునుపెన్నడు లేనంత వైరల్ అయ్యాడు. ముఖ్యంగా ఆర్జీవి వరల్డ్ అంటూ ఓటీటీ బిజినెస్ మొదలుపెట్టిన వర్మ మసాలా సినిమాలతో మంచి ఆదాయాన్ని అందుకుంటున్నాడు. ఓ విధంగా చూసేవాళ్ళని పిచ్చోళ్ళను చేస్తున్నాడనే టాక్ వస్తోంది.

 తెలివైన బిజినెస్..

తెలివైన బిజినెస్..

కరోనా ముందు వరకు వర్మ ఓటీటీలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ లాక్ డౌన్ లో తెలివిగా సినిమాల్ని చిత్రీకరించారు. క్లైమాక్స్ సినిమాకు వర్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అసలు ఎప్పుడు ఎలా తీసాడో కూడా తెలియకుండా సడన్ గా తన ఆర్జీవి వరల్డ్ లో వదిలి మంచి లాభాలను అందుకున్నాడు. సొంతంగా వ్యూవ్ కి ఒక రేట్ ఫిక్స్ చేసుకోవడం వర్మకు బాగా కలిసి వచ్చింది.

ఆ సినిమాతోనే ఎక్కువ లాభాలు..

ఆ సినిమాతోనే ఎక్కువ లాభాలు..

ఇక ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతున్న శ్రీ రాపాకను నటిగా పరిచయం చేసిన వర్మ ఆమెకు స్వీటీ అని ముద్దు పేరు పెట్టి నగ్నం కాన్సెప్ట్ తో పరిచయం చేశాడు. నగ్నం కాన్సెప్ట్ తోనే ఆర్జీవి ఎక్కువ లాభాలను అందుకున్నాడు. ఆమె ట్రేడిషనల్ లుక్ ని బాగా వాడుకొని హాట్ పోజులతోనే యువకులను ఎట్రాక్ట్ చేశాడు.

ఆమె కొత్త అమ్మాయి కాదు..

ఆమె కొత్త అమ్మాయి కాదు..

ఆ విషయాల గురించి పక్కనపెడితే ఇటీవల అప్సర అంటూ కొత్త హీరోయిన్ ని పరిచయం చేరిన ఆర్జీవి ఓ విదంగా ఓ వర్గం వారిని ఫూల్స్ చేస్తూన్నాడనే చెప్పాలి. ఆమె గత ఏడాదిలోనే రెండు సినిమాలు చేసింది. ఉల్లాల..ఉల్లాల, 4 లేటర్స్ అనే సినిమాల్లో మెయిన్ లీడ్ లో నటించిన అంకిత మహారాణానే ఈ అప్సర రాణి.

ఏడాది గ్యాప్ లోనే..

ఏడాది గ్యాప్ లోనే..

వర్మ ఆమె జీవితాన్ని ఏడాది గ్యాప్ లోనే మార్చేశాడు. ఆ రెండు సినిమాలు పెద్దగా ఎవరికి తెలియలేదు. ఉల్లాల ఉల్లాల సినిమా ఆడియో వేడుకకు గెస్ట్ గా వెళ్లిన ఆర్జీవి అక్కడ అంకితను చూసి ఎట్రాక్ట్ అయ్యాడు. స్టేజ్ పైనే ఆమెకి తన ఫోన్ నెంబర్ ఇచ్చిన వర్మ ఎప్పటి నుంచో బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇక థ్రిల్లర్ అనే ఒక కాన్సెప్ట్ దొరకడంతో ఆమెను రప్పించాడు.

సోషల్ మీడియాలో భారీ క్రేజ్..

సోషల్ మీడియాలో భారీ క్రేజ్..

ఆర్జీవి వల్ల అప్సర జీవితం ఒక్కరోజులోనే మారిపోయింది. ట్విట్టర్ లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. అప్సర గా ఆమెను పరిచయం చేసిన వర్మ ఒడిశా అంటూ వివరణ ఇచ్చాడు గాని అసల ముందుగా ఆమె చేసిన సినిమాల గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కొత్త హీరోయిన్ అంటేనే జనాలు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతారాని అంకిత అనే పేరును తీసేసి మొత్తంగా అప్సర అని మార్చేశాడు.

Recommended Video

Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
ప్రతి ఒక్కరిని ఫూల్ చేస్తున్న వర్మ..

ప్రతి ఒక్కరిని ఫూల్ చేస్తున్న వర్మ..

ట్విట్టట్ వంటి సోషల్ మీడియా ఎకౌంట్స్ లో కూడా ఇప్పుడు ఆ బ్యూటీ తనను తాను కొత్తగా అప్సర అనే ప్రమోట్ చేసుకుంటోంది. మొత్తానికి వర్మ హీరోయిన్స్ విషయంలో పేర్లు మార్చుతూ ఓ వర్గం వారిని ఫూల్స్ ని చేస్తున్నాడని టాక్ వస్తోంది. ఏదేమైనా అంకిత పేరుతో పాటు ఇప్పుడు జీవితమే మారిపోయింది. ఇక థ్రిల్లర్ సినిమాతో ఎలా కనిపిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X