పవర్ స్టార్‌పై RGV సినిమా.. పవన్ లుక్ వైరల్, నలుగురు పిల్లలు, 8 బర్రెలతో పాటు వర్మ కూడా..

కాంట్రవర్సీ కథలతో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశాడు. పవర్ స్టార్ పై సినిమా చేయబోతున్నట్లు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన ఆర్జీవి సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను అలాగే నటీనటులకు సంబంధించిన వివరాలను కూడా చెప్పాడు. అలాగే ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recommended Video

Power Star పై Ram Gopal Varma మూవీ.. నలుగురు పిల్లలు, 8 బర్రెలతో పాటు వర్మ కూడా! || Oneindia Telugu
గతంలో ఎప్పుడు లేని విధంగా..

గతంలో ఎప్పుడు లేని విధంగా..

శ్రేయస్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఆర్జీవి వరల్డ్ థియేటర్ ని క్రియేట్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ గతంలో ఎప్పుడు లేని విధంగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను వదులుతున్నాడు. అసలు ఈ రేంజ్ లో వర్మ తన థియేటర్ కి హైప్ క్రియేట్ చేస్తాడా అని అనుకున్న వారందరికి ఉహీంచని షాక్ ఇచ్చాడనే చెప్పాలి. తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసి బాగానే రిలీజ్ చేస్తున్నాడు గాని ఎంతవరకు లాభం అందుకుంటున్నాడో ఎవరికి తెలియదు.

నెక్స్ట్ పవర్ స్టార్..

నెక్స్ట్ పవర్ స్టార్..

క్లైమాక్స్, NNN సినిమాలను గ్రాండ్ గా వదిలిన వర్మ నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా మరో సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా క్లారిటి ఇచ్చాడు. కొన్నికొన్ని సార్లు పవర్ స్టార్ ని స్పెషల్ గా టార్గెట్ చేసే వర్మ ఈ సారి డైరెక్ట్ గా ఒక స్పెషల్ మూవీతో కొట్టబోతున్నట్లు తెలుస్తోంది.

రష్యన్ వైఫ్.. 8 బర్రెలు..

రష్యన్ వైఫ్.. 8 బర్రెలు..

పవర్ స్టార్ టైటిల్ తో రూపొందనున్న ఆ సినిమాలో యాక్టర్స్ వీరే అంటూ.. ఒక రష్యన్ అమ్మాయి, నలుగురు పిల్లలు అలాగే 8 బర్రెలతో పాటు ఆర్జీవి కూడా సినిమాలో కనిపించబోతున్నట్లు పేర్కొన్నారు. చివరగా ఆర్జీవి కూడా సినిమాలో నటించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ అది ఎంతవరకు నిజమో చెప్పలేము.

పవన్ లుక్ వైరల్..

అలాగే పవర్ స్టార్ లుక్ లో నటించనున్న యాక్టర్ కూడా దొరిలేసినట్లు రామ్ గోపాల్ వర్మ ఒక టిక్ టాక్ వీడియోను కూడా రిలీజ్ చేయడం వైరల్ గా మారింది. ప్రస్తుతం మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసుకి సంబంధించిన కథను తెరకెక్కిస్తున్న వర్మ ఆ తరువాత పవర్ స్టార్ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేయనున్నాడు. స్టార్టింగ్ లోనే ఇలా ఉందంటే.. వర్మ ముందు ముందు ఇంకెలాంటి సినిమాలు ఎనౌన్స్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X