వర్మ వారసత్వాన్ని అందుకున్న శ్రావ్య.. ట్విట్టర్‌లో కీలక ప్రకటన

Recommended Video

RGV Niece Shravya Varma Turns Producer For Keerthy Suresh | Dil Raju | Aadhi Pinisetty

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా స్పెషల్ గానే ఉంటుంది. అందుకే ఆయన మాట్లాడినా.. పోట్లాడినా.. ట్వీట్లాడినా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో టాలీవుడ్, బాలీవుడ్‌లో తన సత్తాను చాటుకున్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈయన వారసత్వం ఆయన మేనకోడలు అందుకుంది. అవును.. రాంగోపాల్ వర్మ మేనకోడలు సినిమాల్లో వచ్చేసింది.

కీర్తి సురేష్ సినిమాతో మొదలు

కీర్తి సురేష్ సినిమాతో మొదలు

రాంగోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్యా వర్మ సినీరంగంలోకి అడుగు పెట్టింది. అయితే, ఆమె వస్తున్నది యాక్టర్‌గా కాదు.. నిర్మాతగా. ‘మహానటి'తో తెలుగు సినీ రంగంలో తనదైన మార్క్ చూపించిన కీర్తి సురేష్ చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీకే శ్రావ్య నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాను నగేశ్ కుకునూర్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆది పినిశెట్టి కీలక పాత్ర చేస్తున్నాడు.

ట్వీట్ ద్వారా ప్రకటన

శ్రావ్యా వర్మ సినిమా రంగంలోకి అడుగు పెడుతున్న విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘‘ఈ డ్రీమ్ టీమ్ ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నానని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇంతకంటే మంచి ప్రారంభం ఉంటుందని అనుకోవడం లేదు'' అంటూ వివరాలతో కూడిన ఓ ఫోటోను షేర్ చేసింది.

దిల్ రాజును వెల్‌కమ్ చేస్తూ..

దిల్ రాజును వెల్‌కమ్ చేస్తూ..

ఆది పినిశెట్టి, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజును మెప్పించింది. తనను ఎంతగానో ఆకట్టకున్న ఈ సినిమాను సమర్పించడానికి దిల్ రాజు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని కూడా శ్రావ్య వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో ఉంచి, వెల్‌కమ్ సార్ అంటూ క్యాప్షన్ పెట్టింది.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌'కు వర్క్

‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌'కు వర్క్

ఇప్పుడు నిర్మాతగా పరిచయం అవుతున్న శ్రావ్యా వర్మ.. గతంలో తన మామయ్య రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'కు క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేసింది. ఈ విషయాన్ని వర్మ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులకు వెల్లడించాడు. ఇందుకోసం ఆయన అప్పట్లో షేర్ చేసిన ఫొటో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.

మామయ్యతో కండలు చూపిస్తూ..

మామయ్యతో కండలు చూపిస్తూ..

ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తూ ట్వీట్లు చేసే వర్మ.. గతంలో తన మేనకోడలితో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఇందులో వీరిద్దరూ కండలు చూపిస్తూ కనిపించారు. శ్రావ్య వర్మతో కండలు ప్రదర్శించే విషయంలో పోటీ పడి, ఓడిపోయాను అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఎప్పుడూ తన ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోను వర్మ షేర్ చేయరు. అలాంటిది శ్రావ్యా వర్మ ఫొటో ట్వీట్ చేయడంతో ఆమె సినిమాల్లోకి వస్తుందని ప్రచారం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X