»   » తొడల కోసమే గన్స్ .. సెక్స్ కావాలని డైరెక్టుగా అడుగుతా.. ఆ రోజే చచ్చిపోతా.. వర్మ

తొడల కోసమే గన్స్ .. సెక్స్ కావాలని డైరెక్టుగా అడుగుతా.. ఆ రోజే చచ్చిపోతా.. వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా హవా చెలాయించిన రాంగోపాల్ వర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాను తీసిన చిత్రాలు వారం తిరగకముందే ఠపీమని వెనుకకు తిరిగివస్తున్నాయి. ఇటీవల తీసిన సర్కార్3 ఆయన పరిస్థితి ఏంటో చెప్పకనే చెప్పింది. ఇక తన టైప్ సినిమాలకు కాలం చెల్లిందని తెలుసుకొన్నాడో ఏమో.. మరో మెట్టు కిందకు జారాడు. ఇంటర్నెట్‌లో వెబ్ సిరీస్ పేరిట పక్కా బూతు చిత్రాలను నిర్మించే పనిలో పడ్డారు. తాజాగా ఆయన వదిలిన గన్స్ అండ్ థైస్ చిత్రంపై విమర్శల వర్షం కురుస్తున్నది. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానెల్ తరఫున హోస్ట్ టీఎన్నార్ చేసిన ఇంటర్వ్యూలో వర్మ పలు విషయాలను పంచుకొన్నారు.

తొడలుపై ధ్యాస లేకపోతే..

తొడలుపై ధ్యాస లేకపోతే..

తొడలపై ధ్యాస లేకపోతే తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లేదని రాంగోపాల్ వర్మ అన్నారు. గన్స్ అండ్ థైస్ సినిమాను ఫ్యామిలీతో చూడటానికి వీలుందా? నీ కూతురితో గన్స్ అండ్ థైస్ చూడగలుగుతావా అని హోస్ట్ టీఎన్నార్ ప్రశ్నల వర్షం కురిపించాడు. దానికి రాంగోపాల్ వర్మ ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలుసుకోవడానికి మరో రోజు ఆగాల్సిందే.

సెక్స్ కావాలని అమ్మాయిలను అడుగుతా..

సెక్స్ కావాలని అమ్మాయిలను అడుగుతా..

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. నేను అమ్మాయిలను ఎప్పుడు ట్రై చేయలేదు. ఏ అమ్మాయినైనా నాకు అది కావాలి. ఇస్తావా లేదా అని అడుగుతాను. అంతే పనైపోతుంది అనే విధంగా వర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమ్మాయిలు, సెక్స్ తప్ప మరో ధ్యాస ఉండదు అని మీకు అంత టైమ్ ఎక్కడుంటుంది అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

అమ్మాయిలను నగ్నంగా చూపేటప్పుడు..

అమ్మాయిలను నగ్నంగా చూపేటప్పుడు..

ట్రైలర్‌లో చూపిన విధంగా న్యూడ్ కంటే ఎక్కువగా చూపిస్తారా?.. నగ్నంగా ఓ అమ్మాయిని చూపించినప్పుడు.. ఆమెను అనుభవించకుండా అలా చేశారా? అనే ప్రశ్నకు దేవుడిని పూజించేటప్పుడు దూరం నుంచి చూస్తే ఆ ప్రభావం పోతుంది. దూరం నుంచి చేస్తేనే ఇంకా భక్తి పెరుగుతుంది. సెక్స్ విషయం కూడా అలాంటిందే అనే సమాధానమిచ్చారు.

ఇబ్బంది పెట్టిన వాళ్లకు సారీ..

ఇబ్బంది పెట్టిన వాళ్లకు సారీ..

ట్విట్టర్‌ నుంచి వైదొలగడంపై మాట్లాడుతూ.. నేను ఇబ్బంది పెట్టాలనుకొన్న వాళ్లను ఇబ్బంది పెట్టాను. నాకు నేను బోర్ అయిపోయాను. అందుకే నేనే ట్విట్టర్‌ను బయటకు వచ్చాను. ట్విట్టర్ ద్వారా ఇప్పటివరకు నాగబాబుతోసహా నేను ఇబ్బంది పెట్టిన వాళ్లకు నేను సారీ చెబుతున్నాను అని వర్మ అన్నారు.

దానికి జాతకాలు చెప్పాలా?

దానికి జాతకాలు చెప్పాలా?

నేను నాశనమైపోతున్నానని మరొకరు చెప్పడం ఎందుకు అని జాతకాలపై వర్మ స్పందించారు. ఏ రోజైతే నాకు మరొకరి అవసరం ఉంది. నా చుట్టు నలుగురు లేని పరిస్థితి ఉంది అనుకొంటే.. అప్పుడే, ఆ రోజే నేను చనిపోతాను అని వర్మ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

English summary
Director Ram Gopal Varma become sensational with his latest web series Guns and Thighs. He shares some his thoughts and experiences with one popular Youtube Channel recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X