twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రబాబును చూసి జగన్.. అదిరిపోయే కౌంటర్ వేసిన వర్మ

    |

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఏ మాత్రం అవకాశం దొరికినా సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అయిన వర్మ.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై నడ్డి విరిగిన టీడీపీపై అదును చూసి తనదైన స్టైల్‌లో పంచులేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు వర్మ.

    టీడీపీ కుంగ లోకి తొక్కేస్తున్న వర్మ ట్వీట్లు

    టీడీపీ కుంగ లోకి తొక్కేస్తున్న వర్మ ట్వీట్లు

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరాజయం నుంచి కోలుకోక ముందే తెలుగు దేశం పార్టీపై విరుచుకుపడటం స్టార్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ కామెంట్లు పెట్టి టీడీపీని నవ్వుల పాలు చేస్తున్నాడు. ఇప్పటికే పలు ట్వీట్స్ చేసి టీడీపీ నడ్డి విరిచిన ఆయన తాజాగా మరో ట్వీట్‌తో సంచలనం సృష్టించారు.

    చంద్రబాబు మాట్లాడుతుంటే జగన్ రియాక్షన్

    ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా సీఎం జగన్ నవ్వుతున్నారని వర్మ తన తాజా ట్వీట్‌లో పేర్కొన్నాడు. సినిమా తెరపై బ్రహ్మనందం కనిపించినప్పుడు ప్రేక్షకులు కూడా ఇదే రకంగా నవ్వేవారని పరోక్షంగా టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు వర్మ. గతంలోనూ అనేకసార్లు చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వర్మ ఈ సారి కాస్త డిఫరెంట్ గా చురకలంటించారు.

    లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్

    లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్

    రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నారనో లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ.. ఏ చిన్న ఛాన్స్ దొరికినా వర్మ టీడీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ లెక్కన చూస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎఫెక్ట్ కంటే.. వర్మ పెడుతున్న ట్వీట్ల ఎఫెక్టే టీడీపీ పై ఎక్కువుగా ఉందని అర్థమవుతోంది.

     ఎన్టీఆర్ పై ఒత్తిడి

    ఎన్టీఆర్ పై ఒత్తిడి

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మూటగట్టుకున్న పరాజయం చూస్తే ఇక భవిష్యత్తులో చంద్రబాబు వర్గాన్ని నమ్మే నాథుడే లేడని అర్థమైపోయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో టీడీపీ పగ్గాలు చేతిలోకి తీసుకోవాలంటూ వర్మతో పాటుగా అభిమానులు, ఇతర ప్రముఖుల నుంచి తారక్‌పై ఒత్తిడి పెరుగుతోందని సమాచారం.

    English summary
    In 2019 Ap Elections Telugu Desham Party loosed their ruling. Ysr cp got presigious win. Ram Gopal Varma once again attacked chandrababu with his tweets..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X