పరువు తీశారు: తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కి రామ్ గోపాల్ వర్మ బహిరంగ లేఖ

డ్రగ్స్ కేసు విషయంలో వర్మ బహిరంగ లేఖ రాశారు. ఫిల్మ్ చాంబర్ కు ఆయన ఈ లేఖ సంధించారు.

By Bojja Kumar

డ్రగ్స్ కేసు వ్యవహారంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ వారు ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. ఇలాంటి లేఖ రాసి పరిశ్రమ పరువు తీశారు అంటూ వర్మ మండి పడ్డారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ సంధించారు.

సినీ పరిశ్రమ నిజంగా సిగ్గు పడాల్సిన విషయం డ్రగ్ స్కాండల్ కాదు..ఆ డ్రగ్ స్కాండల్ కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగలేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చే విధంగా అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం...... అంటూ వర్మ తన బహిరంగ లేఖ మొదలు పెట్టారు.

ఏం కారణానికి అపాలజీ చెప్పినట్లు?

ఏం కారణానికి అపాలజీ చెప్పినట్లు?

ఫిల్మ్ ఛాంబర్ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నోటీసులు అందుకుని విచారణకి హాజరైన వారిలో ఏ ఒక్కరూ కూడా తాము తప్పు చేశామని బహిరంగంగా చెప్పడం కానీ, వారిలో ఫలానా వారి తప్పు నిరూపించబడింది అని అధికారులు చెప్పడం గాని ఇంతవరకు జరగలేదు. ఈ రెండూ జరగనప్పుడు ఏ కారణానికి అపాలజీ చెప్పినట్టు?... అని వర్మ ప్రశ్నించారు.

ఆగ్రహించాల్సింది పోయి ఇదేమిటి?

ఆగ్రహించాల్సింది పోయి ఇదేమిటి?

అపాలజీ లెటర్ లో ఒక వాక్యం"అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం"- ఏమిటిది? ఎవరు చెప్పారు మీకు ఎవరు పొరపాట్లు చేసారో?

అసలు వాళ్లు చేసిన నేరమేమిటో, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటో కూడా చెప్పకుండా వాళ్లు అప్పుడే ఏదో మహా నేరం చేసినట్టు కలర్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి ఆల్రడీ నేరం ఋజువైందనే ధోరణిలో క్షమాపణలేఖ పంపించడంలో అర్థం ఏమిటి?...... అంటూ ఫైర్ అయ్యారు.

ఏ మాత్రం -పౌరుషం ఉన్నా

ఏ మాత్రం -పౌరుషం ఉన్నా

అలాగే నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం "మీలో ఏ మాత్రం -పౌరుషం ఉన్నా, మీ పైన వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసికవేదనపై మీరు ఏ మాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా, జరిగిన ఆరోపణలపై నోరు విప్పి మీరు కూడా బహిరంగ లేఖలు రాయాలి.... అంటూ వర్మ సూచించారు.

ఆ హక్కు ప్రతి పౌరుడికీ ఉంది

ఆ హక్కు ప్రతి పౌరుడికీ ఉంది

విషయం కోర్టులో ఉంటే మాట్లాడకూడదనే ఆలోచన సరైనది కావచ్చేమో కానీ, అసలు చార్జెస్ కూడా ఫైల్ అవ్వని ఇలాంటి సందర్భంలో నిజం మాట్లాడే హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ వుంది..... అని వర్మ వ్యాఖ్యానించారు.

అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు

అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు

ఒకవేళ అలా మాట్లాడడం వల్ల చెయ్యని తప్పులని నిజం చేసి, అన్యాయంగా కేసులు బనాయించి చట్టం చట్రంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడలేకపోతే అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు. అది ప్రజాస్వామ్యానికే అవమానం"..... అంటూ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే

ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే

అలాగే రేపు ఫైనల్ గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఛాంబర్ కి ఏ మాత్రం విచక్షణ వున్నా అధికారులకి బహిరంగ క్షమాపణలేఖ రాసినట్టే ఆరోపణలు ఎదుర్కున్న వాళ్లందరికీ బహిరంగ లెఖ ద్వారా క్షమాపణ చెప్పాలి...... అని వర్మ పేర్కొన్నారు.

ఇట్లు రామ్ గోపాల్ వర్మ

ఇట్లు రామ్ గోపాల్ వర్మ

ఇలా చెయ్యని పక్షంలో భావి చరిత్రలొ వీళ్లందరూ నిజంగా నేరస్థులేనని... కాని ఫిల్మ్ ఛాంబర్ చెప్పిన క్షమాపణ మూలానే క్షమించి వదిలేసారనే అబద్ధం నిజంగా నిలిచిపోతుంది..ఆ అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ కి ఉందని గౌరవపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను.

--RGV

తెలుగు ఫిల్మ్ చాంబర్ లేఖ ఇదే...

తెలుగు ఫిల్మ్ చాంబర్ లేఖ ఇదే...

తెలుగు ఫిల్మ్ చాంబర్ ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఇదే. ఆగస్టు 2న ఈ లేఖ రాసినట్లు తెలుస్తుంది.

అవమానకరం

అవమానకరం

ఈ లేఖ రాసిన తీరు సినీ పరిశ్రమకు చాలా అవమానకరంగా ఉందని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.

దారుణం

దారుణం

ఎలాంటి తప్పు రుజువు కాకుండానే ఇలా లేఖ రాయడం ఏమిటని వర్మ మండి పడుతున్నారు.

అంతా కలిసి

అంతా కలిసి

తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అంతా కలిసి ముఖ్యమంత్రికి ఈ విన్నప లేఖను రాశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X