హీరోయిన్‌తో వోడ్కా తాగండి.. అందరూ ఆహ్వానితులే.. రామ్ గోపాల్ వర్మ ఓపెన్ ఆఫర్

వివాదస్పద, విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ చేసిన ఓ ఓపెన్ ఆఫర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కండిషన్స్ అప్లై అంటూ ఆయన తన ఆఫర్ ప్రకటించారు. తనతో పాటు, హీరోయిన్‌తో వోడ్కా తాగండి.. అందరూ ఆహ్వానితులే అని ఈ సందర్బంగా ఆయన పేర్కొనడం ఆసక్తి కలిగించే అంశం. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా వాడుకోవాలి? వివరాల్లోకి పోతే..

వర్మ రూటే సపరేటు.. అదే బాటలో

వర్మ రూటే సపరేటు.. అదే బాటలో

సాధారణంగా అందరు దర్శకులతో పోల్చితే రామ్‌గోపాల్‌ వర్మ రూటే సపరేటు. సరికొత్తగా, వైవిధ్యంగా చిత్రాలను తెరకెక్కించాలన్నా.. పొలిటికల్‌ సెటైర్స్ వేస్తూ సినిమాలు రూపొందించి వివాదాలు సృష్టించాలన్నా ఆయనకు సాటిరారెవ్వరు. అదే బాటలో ఈ సారి నిర్మాతగా సత్తా చాటేందుకు రెడీ అయ్యారు వర్మ. ఈ మేరకు బ్యూటిఫుల్ అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

బ్యూటిఫుల్ అంటూ వర్మ స్టెప్

బ్యూటిఫుల్ అంటూ వర్మ స్టెప్

రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రాబోతున్న తాజా సినిమా `బ్యూటిఫుల్`. ''ట్రిబ్యూట్ టు రంగీలా'' అనేది ట్యాగ్ లైన్. టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొంది న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో నైనా హీరోయిన్‌గా నటించగా, సూరి హీరోగా నటించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

న్యూఇయర్‌ ప్రైవేట్ పార్టీ..

న్యూఇయర్‌ ప్రైవేట్ పార్టీ..

ఈ సందర్బంగా `బ్యూటిఫుల్` సినిమా ప్రమోషన్స్‌ని తనదైన స్టైల్ లో చేస్తూ వర్మ హంగామా చేస్తున్నారు. ఈ మేరకు అందరికీ వోడ్కా ఆఫర్ చేశారు. 'వోడ్కా విత్‌ ఆర్జీవీ లైవ్‌. ఈ రోజు 'బ్యూటిఫుల్‌' టీం ప్రి న్యూఇయర్‌ ప్రైవేట్ పార్టీ ఉంది. నాతో, నైనా గంగూలీతో కలిసి వోడ్కా తాగడానికి అదేవిధంగా మాట్లడటానికి వీలుగా ఈ పార్టీకి మీ అందరినీ ఈ రోజు రాత్రి 8.45 గంటలకు ఫెస్‌బుక్‌, ఇన్‌స్టా లైవ్‌లో కలవడానికి ఆహ్వానిస్తున్నా' అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు.

మరి స్టఫ్ సంగతేంటో..

దీంతో ఈ డిఫరెంట్ ట్వీట్ చూసి నెటిజన్లు కూడా సరదాగా రియాక్ట్ అవుతున్నారు. 'బంపర్‌ ఆఫర్ వర్మతో వోడ్కా పార్టీ'అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. 'వోడ్కా, స్టఫ్‌ మీరు పంపిస్తారా లేక మేమే తెచ్చుకోవాలా' అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టడం విశేషం. చూడాలి మరి వర్మ `బ్యూటిఫుల్` ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X