'బహుబలి కంటే బెటర్ సినిమా తీయగలవా? ' :ఆర్జీవీ ఓపెన్ ఛాలెంజ్
Sandeep Reddy - RGV: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీస్ ను అందించిన ఆర్జీవి.. ఇటీవల కాలంలో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతున్నారు. వరుసగా వివాదాలతో స్నేహం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇంతకీ ఆ చాలెంజ్ ఏంటీ? ఆ ఛాలెంజ్ కు ఆ సందీప్ రీప్లే ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ నో హోటల్ లో సినిమాటికా ఎక్స్ పో (Cinematica Expo)లో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga), కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma )పాల్గొన్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగాతో ఫైర్ సైడ్ చాట్ సెషన్ (fireside chat session) అంటూ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు ఆర్జీవీ. ఈ చిట్ చాట్ లో భాగంగా ఆర్జీవి సందీప్ రెడ్డి వంగాకు బహిరంగంగా సవాల్ విసిరారు.

బాహుబలి కంటే బెటర్ సినిమా తీయగలవా? అంటూ సందీప్ రెడ్డి వంగాకు చాలెంజ్ విసిరాడు రామ్ గోపాల్ వర్మ. ఆ చాలెంజ్ ను స్వీకరించిన సందీప్ రెడ్డి ..'ఎస్ 'అంటూ సమాధానం ఇచ్చి ఆర్జీవిని ఆశ్చర్యపరిచాడు. 'నేను కూడా నీ నుండి ఇదే కోరుకున్న' అంటూ షేక్ హండ్ ఇచ్చి సందీప్ ను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్జీవి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
పైగా 'నేను సందీప్ రెడ్డి వంగను బాహుబలి కంటే బెటర్ మూవీ తీయగలరా? అని ప్రశ్నించాను. సినిమాటికా ఎక్స్పోజ్ లో చాలా బాగా స్పెండ్ చేసాము. ఆర్గనైజర్లకు 30 కిస్సెస్ 'అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ ట్విట్ నెట్ లో తెగ వైరల్ అవుతుంది. కొంతమంది సందీప్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం.. రాజమౌళిని బీట్ చేయడం ఎవరి వల్ల కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
I asked @imvangasandeep whether he can make a better film than BAHUBALI😎😎😎All in all we had a great time at CINEMATICA EXPO 🔥💪❤️💐💃🏻Here’s 30 kisses to the organisers 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 pic.twitter.com/T6WPGUMHY5
— Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2024
ఇదెలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగ టేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన తొలి సినిమా 'అర్జున్ రెడ్డి' సెన్సేషన్ క్రియేట్ చేసింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసి.. బాక్సాఫీసును షేక్ చేసింది. సిని ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ మూవీనే పలు భాషలలో కూడా రీమేక్ చేసి హిట్ కొట్టి ఘనత సందీప్ రెడ్డి వంగకు మాత్రమే దక్కుతుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో యానిమల్ మూవీ తీసి.. బాలీవుడ్ లో రచ్చ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో 'స్పిరిట్' అనే మూవీని తెరకెక్కించబోతున్నారు. రియల్ గా సందీప్ రెడ్డి టేకింగ్ వేరే లెవల్ అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











