twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్యతో గొడవ, ప్రతిపక్షం కుట్ర.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వెనుక అసలు కారణం ఇదే.. ఆర్జీవీ!

    |

    ఓ వైపు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రూపొందిస్తుంటే దానికి పోటీగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో వస్తున్నాడు. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదలయింది. సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ కథయకుడు ప్రేక్షకులని ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని పాటలు, పోస్టర్స్ విడుదల చేస్తో కలకలం సృష్టిస్తున్నాడు. తాను ఎందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానో వర్మ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

    వర్మకే అవకాశం వచ్చిందా

    వర్మకే అవకాశం వచ్చిందా

    బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ప్రకటించిన తర్వాత దర్శకుల గురించి అనేక వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి బాలయ్య పరిశీలించిన దర్శకుల జాబితాలో రాంగోపాల్ వర్మ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాంగోపాల్ వర్మే ఈ చిత్రానికి దర్శకుడు అనుకుంటున్న తరుణంలో అతడు వివరించిన కథ బాలయ్యకు నచ్చలేదట. దీనితో దర్శకుడు తేజన్ని ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం కోసం అధికారికంగా ప్రకటించారు. కథ విషయంలో బాలయ్యతో వర్మకు వివాదం ఏర్పడినట్లు తెలుస్తోంది.

    ప్రతిపక్షం కుట్ర

    ప్రతిపక్షం కుట్ర

    బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి దర్శకుడిని ప్రకటించాడనే వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రకటించారు. బాలయ్యతో విభేదాల కారణంగానే వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. మరికొందరు మాత్రం ఇది చంద్రబాబు ప్రతిష్ట దిగజార్చడానికి ప్రతిపక్షం చేసిన కుట్రగా అభివర్ణించారు. ఈ రెండు ఆరోపణలపై రాంగోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ఆ ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు.

     ఆమె ప్రవేశించిన తర్వాతే

    ఆమె ప్రవేశించిన తర్వాతే

    తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి గల కారణాన్ని వర్మ వివరించాడు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత అనేక మలుపులు చోటు చేసుకున్నా. ఆ పీరియడ్ నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. అందుకే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వర్మ తెలిపాడు. ఎన్టీఆర్ చివరిరోజుల్లో జరిగిన హైడ్రామా ఆయన మరణానికి దారితీసిందని వర్మ తెలిపాడు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి సంబంధం వలన ఒక రాష్ట్ర రాజకీయాలు ఎలా మారాయి అనే పాయింట్ ఈ చిత్రంలో ఉంటుందని తెలిపాడు.

     కాబట్టే ఈ టైటిల్

    కాబట్టే ఈ టైటిల్

    ఎన్టీఆర్ సినిమా స్టార్ గా, పొలిటికల్ లీడర్ గా తిరుగులేని విజయాలు సాధించి ఉండవచ్చు. కానీ లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చాకే ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి అని వర్మ తెలిపాడు. ఆ పీరియడ్ ఎన్టీఆర్ జీవితంలో నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపించింది. అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ పెట్టానని వర్మ తెలిపాడు.

    English summary
    Ram Gopal Varma opens up on reason for doing NT Rama Rao's biopic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X