PK Vs RGV: పవన్ కల్యాణ్-రామ్ గోపాల్ మధ్య పొలిటికల్ వార్.. 'పాపం పసివాడు' మూవీతో కౌంటర్స్

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన స్టైల్ లో ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీకే కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఇక ఆయన ఎక్కువగా మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానిగా చెప్పుకుంటూ పలు కామెంట్స్ చేస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

Ram Gopal Varma Pawan Kalyan Political Counters Over AP CM Jagan

ఏపీ సీఎం టార్గెట్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు చేశారు. 'పాపం పసివాడు' సినిమా పోస్టర్ ను షేర్ చేస్తూ 'ఈ సినిమాను ఎవరైనా ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో తీస్తే బాగుంటుందని' ఆ ట్వీట్ లో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Ram Gopal Varma Pawan Kalyan Political Counters Over AP CM Jagan

ఒక్క సూట్ కేస్ కాదు: "మన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని ఆశిస్తున్నాను. ఆయన చాలా ఇన్నోసెంట్. ఎలాంటి కల్లాకపటం ఎరుగని వ్యక్తి. కానీ ఈ సినిమాలో చిన్న చేంజ్ చేయాలి. ఆయన చేతిలో ఉన్న ఒక్క సూట్ కేస్ కాకుండా.. అక్రమ సంపాదన కోసం ఓపెన్ చేసిన సూట్ కేస్ కంపెనీలన్నింటినీ పెట్టాలి" అని రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.

Ram Gopal Varma Pawan Kalyan Political Counters Over AP CM Jagan

నదుల నుంచి దోచుకున్న: జనసేనాని ఇంకా ట్వీట్ లో కొనసాగిస్తూ.. "డియర్ ఏపీ సీఎం. నువ్వు కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య కాదు. కామ్రెడ్ తరిమెల నాగిరెడ్డి కాదు. అక్రమ సంపాదనను కూడగట్టి, జనాల మధ్య గొడవలు సృష్టించే నీకు క్లాస్ వార్ అనే పదాన్ని పలికే హక్కు లేదు.

మీ నుంచి, మీ గ్రూప్ నుంచి ఏదో ఒక రోజు రాయలసీమ విముక్తి పొందుతుందని భావిస్తున్నాను. ఈ కథకు రాజస్థాన్ ఎడారిలోని ఇసుక తిన్నెలు అవసరం. కానీ, ఏపీలోని నదుల నుంచి వైసీపీ దోచుకున్న ఇసుక దిబ్బలు జగన్ తో సినిమా చేయడానికి సరిపోతాయి" అని విమర్శలు గుప్పించారు.

మల్టీపుల్ డిజాస్టర్: "పవన్ కల్యాణ్ ట్వీట్ కు అంతేఘాటుగా స్పందించారు ఆర్జీవీ. నీతో కూడా ఈ సినిమాను ఎవరైనా చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, మీరు అజ్ఞానంతో నిండిన అమాయకులు. అమాయకత్వం నిండిన కల్లాకపటం లేని మనిషి. ఇక్కడ ఒక చేంజ్ అవసరం. ఒక పాత్రను పోషించే బదులు మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ను కలిగి ఉన్న పాత్రను చేయండి" అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma Pawan Kalyan Political Counters Over AP CM Jagan

అమాయక అనుచరులు: "సీఎం కావాలని కోరుకోని ప్రియమైన పవన్ కల్యాణ్.. నువ్వు ఎన్టీ రామారావు కాదు. ఎంజీఆర్ కాదు. మీ అవగాహనలేమి, మీ అభిమానులపై మీరు ప్రేరేపించే హింస నేపథ్యంలో ప్రజాసేవ అనే పదాన్ని పలికే అర్హత లేదు. ఏదో ఒక రోజు మీ నుంచి, మీ సైకోపాతిక్ నార్సిజం నుంచి మీ జనసైనికులు బయటపడతారని భావిస్తున్నాను.

ఈ స్టోరీకి మీకు రాజస్థాన్ ఎడారులు అవసరం. కానీ ఏపీ ప్రజలకు అసత్యాలు చెప్పి వారిని నమ్మించడానికి మీకు హైదరాబాద్ కావాలి. ఎందుకంటే థియేటర్ కలెక్షన్ పాయింట్స్ వద్ద మీకు కొంతమంది అమాయక అనుచరులు ఉన్నారు కాబట్టి. చీర్స్" అని ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

పవన్ వర్సెస్ ఆర్జీవీ: ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్, ఆర్జీవీ ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వైసీపీ మద్దతుదారులు రామ్ గోపాల్ వర్మకు సపోర్ట్ చేస్తూ పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. 200 ఎమ్ఎమ్ రాడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే జనసేన మద్దతుదారులు పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలుస్తూ ఆర్జీవీపై దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ పేటీఎం కుక్క అంటూ తిట్టిపోస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X