రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ 'ఆవహం' స్టోరీ లైన్
'ఆవహం' కథ, 'రక్ష' చిత్రంలో చనిపోయిన మంత్రగత్తె ప్రేతాత్మ రూపంలో తిరిగొచ్చి, తన మరణానికి కారణమైన మంత్రగాణ్ణి చంపడంతో మొదలవుతుంది అంటూ రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం 'ఆవహం' గురించి చెప్తున్నారు. ఈ చిత్రం కథ,కథనాలు వివరిస్తూ... 'రక్ష' చిత్రంలో చేతబడిలాంటి క్షుద్రశక్తులు తెలిసిన ఒక మంత్రగత్తె తన స్వప్రయోజనాల కోసం ఓ చిన్నపిల్లని హింసిస్తూ చంపే ప్రయత్నంలో ఆ అమ్మాయి తండ్రిని అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. తన పాపను రక్షించుకునే ప్రయత్నంలో ఆ తండ్రి ఒక మంత్రగాణ్ణి కలిసి అతని సహాయంతో ఆమెను చంపుతాడు. 'ఆవహం' చిత్రకథ, ఆ చనిపోయిన మంత్రగత్తె ప్రేతాత్మ రూపంలో తిరిగొచ్చి, తన మరణానికి కారణమైన మంత్రగాణ్ణి చంపడంతో మొదలవుతుంది. 'రక్ష'లో రాజీవ్ కుటుంబం అనుభవించిన పరిస్థితుల కంటే కూడా అత్యంత దుర్భరమైన పరిస్థితులు 'ఆవహం'లో ఉంటాయి. ఎప్పుడైతే ఆ ప్రేతాత్మ మంత్రగాణ్ణి బలి తీసుకున్నప్పుడు, ఆ కుటుంబం పరిస్థితేంటి? అని అంటున్నారు.
అలాగే ఈ 'ఆవహం' చిత్రం ఎలా మొదలైందో చెపుతూ..ఓ రోజు రచయిత మిలింద్ నన్ను కలవడానికి వచ్చాడు. 'రక్ష' సినిమాకు సీక్వెల్‌గా 'ఆవహం' చేద్దామంటూ ఓ ఐడియా చెప్పాడు. ఓపెనింగ్ ఎపిసోడ్ విని చాలా ఎగ్జైట్ అయ్యాను. వెంటనే 'ఆవహం' చేయాలని నిశ్చయించుకున్నాను అన్నారు.ఈ చిత్రం పిబ్రవరి రెండవ వారంలో విడుదల కానుంది. అలాగే 'రక్ష' కన్నా ఎక్కువ భయపెడుతుందీ సినిమా..ఇది 'భూత్' తరహా భయానక చిత్రం. అని హామీ ఇస్తున్నారు. ఆయన సమర్పణలో సార్థక్ మూవీస్ ప్రై.లిమిటెడ్, జడ్‌త్రీ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం 'ఆవహం'. మిలింద్ గడాక్కర్ దర్శకుడు. నిర్మాత ప్రశాంత్ బుర్రా మాట్లాడుతూ-" హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











