మారిపోయిన రామ్ గోపాల్ వర్మ.. 'నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి'.. అంటూ ఆ ఫోటో పోస్ట్..
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆయన అనూహ్యంగా తనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అంటూ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనితో పాటు ఒక ఫోటో కూడా షేర్ చేయడంతో దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది.. ఆ వివరాల్లోకి వెళితే..

బయోపిక్స్ మీద దృష్టి
నాగార్జునతో శివ అనే సినిమా చేసి ట్రెండ్ సెట్టర్ గా మారిపోయిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. బాలీవుడ్ కి కూడా వెళ్లి అమితాబ్ బచ్చన్ వంటి అనేక మంది స్టార్లతో కూడా పని చేసిన ఆయన ఈ మధ్యకాలంలో ఎందుకు వివాదాస్పద సినిమాలు చేయడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువగా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, అలాగే బయోపిక్స్ మీద దృష్టి పెడుతున్నారు వర్మ.

కొండా పేరుతో
ఇప్పటికే వంగవీటి, రక్త చరిత్ర లాంటి బయోపిక్ సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకపాత్ర పోషించి ప్రస్తుత రాజకీయాల్లో అంతగా యాక్టివ్గా లేని కొండా సురేఖ, కొండా మురళి దంపతులు జీవితం మీద బయోపిక్ చేస్తున్నారు. కొండా పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అయితే కాస్త టైం దొరుకుతుంది అప్పుడు విడుదల చేయవచ్చు అని రామ్ గోపాల్ వర్మ భావిస్తున్నారు.

అనేక సందర్భాలలో
అయితే రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అని తనకు ఏమి అవసరం అనుకుంటే అది చేస్తా అని అవసరం లేని పని చేయను అని ఖరాఖండిగా చెబుతుంటారు. తాను మారిపోయిన మనిషిని కాబట్టి భార్యకు, కూతురికి కూడా దూరంగా తన పని మీద దృష్టి పెట్టి బతుకుతూ ఉంటాను అంటూ ఆయన అనేక సందర్భాలలో చెప్పుకొస్తూ ఉంటారు.

చర్చనీయాంశంగా
అలాంటి రాంగోపాల్ వర్మ తాను ఇప్పుడు మారిపోయాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. తనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని చెబుతూ ఒక కుక్కని హత్తుకున్న ఫోటోని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సెలబ్రిటీల కుక్కలని పెంచుకోవడం చాలా సాధారణమైన విషయం. కానీ రామ్ గోపాల్ వర్మ ఆ ఫోటో పోస్ట్ చేసి తను కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Sometimes I also have feelings pic.twitter.com/QuF2AZqYTm
— Ram Gopal Varma (RGVzoomin) March 10, 2022
కౌంటర్ గా
నిజంగా వర్మ ఆ కుక్క పిల్ల మీద ప్రేమతో ఇలా పోస్ట్ చేశాడా లేక కొందరు సెలబ్రిటీలు కుక్కలతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటే వాళ్లకు కౌంటర్ గా పోస్ట్ చేశాడా అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. ఏదేమైనా వర్మ మాత్రం ఎప్పుడూ ఏదో ఒక అంశంతో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











