Don't Miss!
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్‌తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
ఆ సూపర్ హిట్ సీక్వెల్ తో వర్మ గత వైభవం పొందుతాడా?
ఫూంక్, రక్త చరిత్ర చిత్రాల సీక్వెల్స్ ని తెరకెక్కించిన వర్మ మరో చిత్రానికి సీక్వెల్ రెడీ చేయనున్నారని చెప్తున్నాడు.తన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'రంగీలా' సినిమాకి సీక్వెల్ తీయాలనేది వర్మ ప్లాన్ చేస్తున్నానని చెప్పారు.రీసెంట్ గా రెహమాన్ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభలో వర్మ కు కృతజ్ఞతలు తెలిపారు.ఆయన సహకారంతోనే ఈ రోజు ఈ స్థితికి చేరానని ముఖ్యంగా 'రంగీలా' సినిమా తన జీవితాన్ని మలుపు తిప్పిందని రెహమాన్ అన్నారు. దీంతో అక్కడే ఉన్న వర్మకు వెంటనే 'రంగీలా' సీక్వెల్ తీయాలన్న ఆలోచన పుట్టింది.రెహమాన్‌తో ఈ విషయమై సంప్రదించారు.
రంగీలా గురించి వర్మ మాట్లాడుతూ ''రంగీలా సినిమా కోసం మంచి స్వరాలు సమకూర్చారు రెహమాన్. అందులో వచ్చే 'హాయ్ రామా', 'తన్హా తన్హా' పాటల్ని గోవాలో, టైటిల్ ట్రాక్ 'హో జా రంగీలా రే'ను ముంబయిలోని నా అపార్ట్మెంట్లో స్వరపరిచారు. ఆయన హృదయంలోంచి స్వరాలు పలుకుతాయ''ని అన్నారు.ఇక ఈ సినిమాను కె.విశ్వనాధ్ సీతామహాలక్ష్మి సినిమా చూసి ప్రేరణ పొంది చేసినట్లు చెప్తారు.
అందులో చంద్రమోహన్ తన స్వీయ శక్తితో తాళ్లూరి రామేశ్వరిలో టాలెంట్ ని మేలుకొలిపి పెద్ద హీరోయిన్ అయ్యేందుకు సాయం చేస్తాడు. ఆమె ఎదిగిన తర్వాత అతన్ని కలవటానికి సరిపడదు.అప్పుడు జరిగే డ్రామా ఆ సినిమా . ఏది ఏమైనా వర్మ ఎలా చేస్తేనేం మంచి పాటలతో ...అమీర్ ఖాన్ మేలైన నటనతో రంగీళా బ్లాక్ బస్టర్ గా భాక్సాఫీసు దగ్గర నిలబడింది.మరి సీక్వెల్ కు ఏ చిత్రం ప్రేరణగా నిలుస్తుందో చూడాలి.