twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సూపర్ హిట్ సీక్వెల్ తో వర్మ గత వైభవం పొందుతాడా?

    By Srikanya
    |

    ఫూంక్, రక్త చరిత్ర చిత్రాల సీక్వెల్స్ ని తెరకెక్కించిన వర్మ మరో చిత్రానికి సీక్వెల్ రెడీ చేయనున్నారని చెప్తున్నాడు.తన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'రంగీలా' సినిమాకి సీక్వెల్ తీయాలనేది వర్మ ప్లాన్ చేస్తున్నానని చెప్పారు.రీసెంట్ గా రెహమాన్‌ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభలో వర్మ కు కృతజ్ఞతలు తెలిపారు.ఆయన సహకారంతోనే ఈ రోజు ఈ స్థితికి చేరానని ముఖ్యంగా 'రంగీలా' సినిమా తన జీవితాన్ని మలుపు తిప్పిందని రెహమాన్‌ అన్నారు. దీంతో అక్కడే ఉన్న వర్మకు వెంటనే 'రంగీలా' సీక్వెల్‌ తీయాలన్న ఆలోచన పుట్టింది.రెహమాన్‌తో ఈ విషయమై సంప్రదించారు.

    రంగీలా గురించి వర్మ మాట్లాడుతూ ''రంగీలా సినిమా కోసం మంచి స్వరాలు సమకూర్చారు రెహమాన్‌. అందులో వచ్చే 'హాయ్‌ రామా', 'తన్హా తన్హా' పాటల్ని గోవాలో, టైటిల్‌ ట్రాక్‌ 'హో జా రంగీలా రే'ను ముంబయిలోని నా అపార్ట్‌మెంట్‌లో స్వరపరిచారు. ఆయన హృదయంలోంచి స్వరాలు పలుకుతాయ''ని అన్నారు.ఇక ఈ సినిమాను కె.విశ్వనాధ్ సీతామహాలక్ష్మి సినిమా చూసి ప్రేరణ పొంది చేసినట్లు చెప్తారు.

    అందులో చంద్రమోహన్ తన స్వీయ శక్తితో తాళ్లూరి రామేశ్వరిలో టాలెంట్ ని మేలుకొలిపి పెద్ద హీరోయిన్ అయ్యేందుకు సాయం చేస్తాడు. ఆమె ఎదిగిన తర్వాత అతన్ని కలవటానికి సరిపడదు.అప్పుడు జరిగే డ్రామా ఆ సినిమా . ఏది ఏమైనా వర్మ ఎలా చేస్తేనేం మంచి పాటలతో ...అమీర్ ఖాన్ మేలైన నటనతో రంగీళా బ్లాక్ బస్టర్ గా భాక్సాఫీసు దగ్గర నిలబడింది.మరి సీక్వెల్ కు ఏ చిత్రం ప్రేరణగా నిలుస్తుందో చూడాలి.

    English summary
    Ram Gopal Varma is keen to work on a sequel with AR Rahman to revive the magic of his 1995 blockbuster “Rangeela”. Well the idea came into Varma’s mind recently when he met Rahman at the launch of the music composer's biography.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X