బాలాజీ మీద ఒట్టు.. పవన్ కల్యాణ్‌ని అలా చూపెట్టను.. పవర్ స్టార్ న్యూ స్టిల్స్ వదిలిన RGV

విలక్షన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు మసాలా సినిమాలతో హాట్ టాపిక్ గా నిలిచిన వర్మ ఇప్పుడు మళ్ళీ పాలిటీక్స్ వైపు యూ టర్న్ తీసుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా పవర్ స్టార్ పై సినిమా తీసి అందరిని మెప్పిస్తాను అంటున్నాడు. ఎన్నికల తరువాత జరిగిన పరిస్థితి గురించి అందులో ఎక్కువగా చూపించనున్నాడట. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పోస్టర్స్ తో ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు.

ఇంటి నుంచి ఫామ్ హౌజ్ వరకు

ఇంటి నుంచి ఫామ్ హౌజ్ వరకు

నిన్నటి నుంచి రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన స్టిల్స్ తో జనాల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి ఫామ్ హౌజ్ వరకు అన్ని రకాల షేడ్స్ ని సినిమాలో చూపించబోతున్నట్లు చెబుతున్నాడు. ఇక కొన్ని స్టిల్స్ లలో దాదాపు పవన్ కళ్యాణ్ ఉన్నాడా అనే విధంగా నటుడు స్టిల్స్ ఇచ్చాడు.

త్రివిక్రమ్ ని కూడా వదల్లేదు..

త్రివిక్రమ్ ని కూడా వదల్లేదు..

ఇక పవన్ కళ్యాణ్ స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఎంత క్లోజ్ గా ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక క్యాప్ పెట్టుకొని పేపర్స్ తో పవన్ కళ్యాణ్ పక్కనే త్రివిక్రమ్ ఉన్నట్లు చూపించడం ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటోంది.

రష్యన్ యువతి ఎదురుగా

రష్యన్ యువతి ఎదురుగా

వర్మ రియాలిటీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని కూడా ఇన్వాల్స్ చేయడం కొంత కాంట్రవర్సీ గా మారింది. ఎదురుగా రష్యన్ యువతి, గోడపై చెగువేర అలాగే చేతిలో పవన్ ఒక పుస్తకం పట్టుకున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తక్కువ స్థాయిలో చూపించడం లేదని వర్మ అయితే గట్టిగానే చెబుతున్నాడు.

Recommended Video

Shruti Haasan Demands Huge Remuneration For Pawan Kalyan's Movie
బాలాజీ మీద ఒట్టు..

బాలాజీ మీద ఒట్టు..

గతంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ కాంట్రవర్సీ కథలో పవన్ కళ్యాణ్ ని తక్కువ చేసి చూపించిన వర్మ ఈ సారి కూడా అలానే చూపిస్తాడు అనే కామెంట్స్ కి వర్మ ఆన్సర్ ఇచ్చాడు. లార్డ్ బాలాజీ మీద ఒట్టేసి చెబుతున్నా ఆ విదంగా ఆయితే ఎవరిని తక్కువ చేసి చూపించను అని వర్మ ఒక వివరణ ఇస్తున్నాడు. మరి ఆయన ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X