పవర్‌స్టార్‌తో వర్మ మరో జిమ్మిక్కు.. పవన్ కళ్యాణ్ పేరును అలా వాడేశాడు!

రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సెటైర్ వేస్తూనే అది సెటైర్ కాదు అని మన చేతే చెప్పించి, ఒప్పించగల ఘనుడు. పవన్ కళ్యాణ్ మీదే సినిమా తీస్తూ అచ్చు ఆయనలానే ఉండే ఓ వ్యక్తిని పట్టుకొచ్చి సినిమా తీస్తున్నాడు. పవర్ స్టార్ పేరిట రోజూ ఏవేవో స్టిల్స్ రిలీజ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా తన హీరో పేరును కూడా ప్రకటించాడు. ఇన్ని రోజులు అతనికి ఏ పేరు పెడతారా అని ఆసక్తిగా ఎదురుచూసిన వ్యక్తులు ఆశ్చర్యపోయేలా ఓ పేరును పెట్టేశాడు. అదేంటో ఓసారి చూద్దాం.

అదంతా యాధృచ్చికమే..

అదంతా యాధృచ్చికమే..

పవన్ కళ్యాణ్‌లా పోలి ఉన్న ఓ వ్యక్తిని పట్టుకువచ్చి.. సేమ్ డ్రెస్సింగ్ వేసి పవర్ స్టార్ అంటూ సినిమాను ప్రకటించాడు ఆర్జీవీ. అయితే అది అందరూ పవన్ కళ్యాణ్‌పై తీసే చిత్రమేనని చెప్పుకుంటూ ఉంటే.. అలాంటిదేమీ లేదని ఎక్కడైనా పోలికలు కనిపిస్తే అది యాధృచ్చికమే కానీ కావాలని చేసింది కాదని వెన్నెపూసలా రాసుకొచ్చాడు.

వర్కింగ్ స్టిల్స్‌తో హల్చల్..

వర్కింగ్ స్టిల్స్‌తో హల్చల్..

ఎన్నికల తరువాత జరిగిన కథ అంటూ వరుస బెట్టి పోస్టర్లను రిలీజ్ చేస్తున్నాడు. ఫాంహౌస్‌లో గడపడం, పుస్తకాలు చదవడం, చిరంజీవి పోలికలతో ఉన్న ఓ వ్యక్తితో ముచ్చట్లు పెట్టినట్టు, ఓ స్టార్ డైరెక్టర్ (త్రివిక్రమ్ పోలికతో'ను కొట్టినట్టు, ఓ రష్యన్ భామతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నాడు.

టీ గ్లాస్‌ను కూడా..

టీ గ్లాస్‌ను కూడా..

వర్మ జనసేన గుర్తు టీ గ్లాస్‌ను కూడా వదల్లేదు. శివ సినిమాలో సైకిల్ చైన్ ఎలానో పవర్ స్టార్ సినిమాలో గ్లాస్ అలా అని చెప్పుకొచ్చాడు. శివ సినిమాలో సైకిల్ చైన్‌ను ఎలాగైతే ఎక్కువగా వాడతాడో అలా మా సినిమాలో హీరోకు టీ తాగడం ఇష్టం అందుకే టైటిల్‌లో అలా పెట్టామని క్లారిటీ ఇచ్చాడు.

Recommended Video

Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
 హీరో పేరు..

హీరో పేరు..

తాజాగ పవర్ స్టార్ సినిమా హీరో పేరును కూడా ప్రకటించాడు. మెగా ఫిల్మ్ పవర్ స్టార్‌లో ప్రవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని, అతనో గొప్ప నటుడని చెప్పుకొచ్చాడు. అందులోనూ మెగా అనే ట్యాగ్‌ను ఇరికించడం, పవన్ కళ్యాణ్ పేరును చిన్న మార్పుకు గురి చేసి ప్రవన్ కళ్యాణ్‌గా తన హీరోకు నామకరణం చేయడం చూస్తుంటే వర్మకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేననిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X