For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి బర్త్‌డేకు బన్నీ అందుకే రాలేదు.. పవన్, చరణ్ సహా వాళ్లంతా వేస్ట్: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

  |

  అక్కినేని నాగార్జున నటించిన 'శివ' అనే మూవీతో దర్శకుడిగా పరిచయమై.. తనదైన శైలి డైరెక్షన్‌తో తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆరంభంలోనే విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలతో తన సత్తాను దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన అతడు.. టాలీవుడ్ స్టామినాను కూడా వెలుగెత్తా చూపించాడు. తద్వారా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు.

  దీంతో బాలీవుడ్‌లో సైతం సినిమాలు చేసి ఔరా అనిపించాడు. అంతటి ఖ్యాతి గడించిన ఈ దర్శకుడు.. కొంత కాలంగా సినిమాల పరంగా తన ప్రభావాన్ని కోల్పోతున్నాడు. అదే సమయంలో పలు వివాదాల్లోనూ చిక్కుకుంటున్నాడు వర్మ. ఈ క్రమంలోనే తాజాగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాడతను. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  Chiranjeevi lovely kiss to Pawan Kalyan: తమ్ముడిపై అంచంచలమైన ప్రేమను కురిపించిన మెగాస్టార్

  అప్పుడలా.. ఇప్పుడిలాంటి సినిమాలు

  అప్పుడలా.. ఇప్పుడిలాంటి సినిమాలు

  అప్పట్లో క్రైమ్, లవ్, రొమాంటిక్, హర్రర్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేసి రాంగోపాల్ వర్మ అప్పుడెప్పుడో తన స్టామినాను దేశ వ్యాప్తంగా చాటి చెప్పుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన పంథాను మార్చుకున్నారు. ఇందులో భాగంగానే కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులపై ఫోకస్ చేశాడు.

  ఈ క్రమంలోనే ‘రక్త చరిత్ర' నుంచి వరుసగా ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి వివాదాస్పద సినిమాలను తెరకెక్కించాడు. ఇక, గత ఏడాది పవన్ కల్యాణ్‌ రాజకీయాలపై ‘పవర్ స్టార్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.

  ఏకాంతంగా ఒకే ఇంట్లో సినీ జంట ఎంజాయ్: అతడు బట్టల్లేకుండా.. ఆమె ప్రైవేట్ ఫొటోలు బయటకు!

  వివాదాలతో సహవాసం చేస్తోన్న ఆర్జీవీ

  వివాదాలతో సహవాసం చేస్తోన్న ఆర్జీవీ

  దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలెట్టిన సమయంలో గొప్ప గొప్ప సినిమాలను రూపొందించి.. దేశమే గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు రాంగోపాల్ వర్మ. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన ప్రవర్తనలో పూర్తిగా మార్పులు వచ్చాయి. దూకుడైన వ్యవహార శైలితో ప్రతి అంశంపై స్పందించే ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు.

  తద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలు, అభిమానులకు శత్రువులా మారిపోయాడు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ బోల్డుగా మాట్లాడుతూ తరచూ హాట్ టాపిక్ అవుతున్నాడు. దీంతో ఈ వర్మ పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

  మెగా ఫ్యామిలీ ఫొటో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

  మెగా ఫ్యామిలీ ఫొటో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

  గత ఆదివారం (ఆగస్టు 22)న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకున్నారు. అదేరోజున రాఖీ పండుగ కూడా వచ్చింది. వాళ్ల ఆనందం రెట్టింపు అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కల్యాణ్, నాగేంద్ర బాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు.

  అదే సమయంలో ఇంట్లో రాఖీ పండుగను కూడా ఘనంగా జరుపుకున్నారు. ఈ హీరోలందరూ కలిసి ఉన్న ఓ ఫొటో వైరల్ అయింది. దీంతో అభిమానులంతా ఫుల్ ఖుషీ అయిపోయారు.

  బిగ్ బేబీ బ్రదర్‌తో నిహారిక సందడి: సర్‌ప్రైజ్‌ చేసి సస్పెన్స్‌గా ఉంచి.. మెగా కిడ్‌ను గుర్తుపట్టారా!

  అల్లు అర్జున్ మిస్సింగ్.. సందేహాలు వ్యక్తం

  అల్లు అర్జున్ మిస్సింగ్.. సందేహాలు వ్యక్తం

  చిరంజీవి పుట్టినరోజున ఆయనను కలిసిన హీరోలందరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ ఫొటో బయటకు రాగానే.. అందరిలోనూ ఒకే సందేహం వ్యక్తం అయింది. అదే.. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎందుకు మిస్ అయ్యాడని. నిజానికి అతడు కూడా మెగాస్టార్ చిరంజీవిని విపరీతంగా అభిమానిస్తాడు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ, మెగా ఫ్యామిలీ ఫొటోలో ఈ స్టార్ హీరో మిస్ అవడం ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. దీనిపై అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరిగింది. దీంతో ఈ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.

  మెగా హీరోలను మళ్లీ టార్గెట్ చేసిన వర్మ

  మెగా హీరోలను మళ్లీ టార్గెట్ చేసిన వర్మ

  రాంగోపాల్ వర్మ చాలా కాలంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటాడన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది పవన్ కల్యాణ్‌పై విమర్శనాత్మకంగా ఓ సినిమాను కూడా తెరకెక్కించాడు. దీనికి కౌంటర్‌గా మెగా అభిమానులు ఆయనపైనా ఓ సినిమాను తీశారు. ఇలా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవితో కలిసి మెగా హీరోలందరూ దిగిన ఫొటోపై తాజాగా రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఈ క్రమంలోనే పలువురు హీరోలను విమర్శిస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

  Intinti Gruhalakshmi August 24th Episode: ఇంట్లో అంకితకు అవమానం.. లాస్య ప్లాన్‌కు చెక్ పెట్టిన శృతి

  అందుకే రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు

  అందుకే రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు

  మెగా ఫ్యామిలీ ఫొటోలో అల్లు అర్జున్ కనిపించకపోవడంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దీనిపై స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ‘అల్లు అర్జున్ ఎంతో తెలివైన వాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన బర్త్‌డే సెలెబ్రేషన్స్‌కు ఈ హీరో హాజరు కాలేదు. అంతేకాదు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా చిరంజీవి సక్సెస్‌ను చెప్పుకుని ఎదిగిన హీరో కాదు.. అల్లు అర్జున్ స్వతహాగా ఎదిగిన స్టార్' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  Allu Arjun వేరు.. మెగా హీరోలు వేరు - RGV | Pushpa Raj అందుకే మిస్ || Filmibeat Telugu
  అల్లు అర్జున్‌పై ప్రశంసలు.. వాళ్లపై ట్రోల్స్

  అల్లు అర్జున్‌పై ప్రశంసలు.. వాళ్లపై ట్రోల్స్

  తన ట్విట్టర్ ఖాతాలో మెగా హీరోలను వేస్ట్ అన్నట్లు తక్కువ చేసి మాట్లాడిన రాంగోపాల్ వర్మ.. అల్లు అర్జున్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురిపించాడు. ‘మెగాస్టార్ చిరంజీవి తర్వాత నిజమైన మెగాస్టార్ అల్లు అర్జున్ మాత్రమే' అని ఓ ట్వీట్‌ చేశాడు. అలాగే, మరో ట్వీట్‌లో ‘అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అర్జున్ ఎప్పుడో సక్సెస్‌ను అందుకున్నాడు. చిరంజీవి కుమారులు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు, మేనమామలు మొదలైన బంధువుల కంటే ముందే అతడు విజయాన్ని అందుకున్నాడు' అని అర్థం వచ్చేలా పోస్టులు పెట్టాడు. దీంతో అతడిపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

  English summary
  Sensational Director Ram Gopal Varma Responded on Mega Family Photo in Twitter. Then He Praises Allu Arjun and Criticise Pawan Kalayan, Ram Charan And Mega Heroes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X