twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ 'డబుల్ జంపుడు' అంటున్న వర్మ

    By Srikanya
    |

    ఇప్పుడే పూరీ జగన్, మహేష్ ల బిజెనెస్ మ్యాన్ లో కొన్ని సీన్స్ చూసాను... ఇది దూకుడు కాదు జంపుడు కాదు... డబుల్ జంపుపు అన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇంతకు ముందు కూడా రామ్ గోపాల్ వర్మ పూరీ జగన్నాధ్ రాణాల నేను.. నా రాక్షసి చిత్రం ప్రమోట్ చేసారు.. ఇలాగే ఓ రేంజిలో...అయితే ఆ చిత్రం ఫలితం తేడాగా వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటిది జరగదు అంటున్నారు. ఇక ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం.. కొనుగోళ్ళు.. అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు. గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ ని కూడా పూరి రెడీ చేస్తున్నారు. హిందీ వెర్షన్ లో అబిషేక్ బచ్చన్ చేయనున్నారు.

    'బిజినెస్‌మ్యాన్‌'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్‌ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓపినింగ్ జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    RGV said "Ippude poori jagan mahesh businessman lo konni scenes choosaanu ....idhi dookudu kaadhu jumpudu kaadhu idhi double jumpudu".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X