Don't Miss!
- News ఏపీలో మొత్తం మారిపోయిన సీన్..గెలుపు ఆ పార్టీదే తేల్చిసిన సర్వే
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Lifestyle చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే..విజయం వద్దన్నా వస్తుంది..
- Technology 100mbps అధిక వేగంతో Airtel Xstream AirFiber కొత్త ప్లాన్లు! ప్లాన్ల వివరాలు
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
- Sports ఆర్సీబీలో ఆడే ఇండియన్ ప్లేయర్లకు ఇంగ్లీషే రాదు: సెహ్వాగ్ సెన్సేషన్
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే.. ఖరీదైన జాగ్వార్ F టైప్ స్పోర్ట్స్ కారులో బామ్మ చక్కర్లు
అరేయ్ జగన్‌గా.. బాడ్కోవ్ అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్..
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో మంచి జోష్ మీద కనిపిస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో మళ్లీ ట్రాక్‌పైకి వచ్చిన ఆర్జీవి.. ఇటీవల కాలంలో తనదైన శైలిలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా తన శిష్యుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ర రిలీజై భారీ కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సందర్భంగా ఇటీవల శ్రీరాములు థియేటర్లో సినిమాను వీక్షించిన తర్వాత వర్మ రచ్చ రచ్చ చేశాడు.. ఆయన చేసిన హంగామా మీరే చూడండి..
ఏయ్ పూరీ జగన్నాథ్ అంటూ
ఏయ్ పూరీ జగన్నాథ్.. నేను శ్రీరాములు థియేటర్ మూసాపేట్ మేనేజర్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్ చూశాను. మళ్లీ నేను రెండో ఆట చూడటానికి వెళ్తున్నాను అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఇలా జోష్‌తో వరుసగా ట్వీట్లు చేస్తూ వాటిపై వస్తున్న కామెంట్లను గట్టిగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది.
|
హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్‌తో
ఇలా వరుస ట్వీట్లలో భాగంగా రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశాడు. హెల్మెట్ లేకుండానే దర్శకులు అజయ్ భూపతి, అగస్త్యతో కలిసి మోటార్ బైక్‌పై ట్రిపుల్ రైడ్‌తో శ్రీరాములు థియేటర్‌కు వెళ్లారు. సిటీ మొత్తంలో పోలీసులు ఎక్కడా కనిపించలేదు? బాహుశా ఇస్మార్ట్ శంకర్ సినిమా చూస్తూ ఉండి ఉంటారు అని అన్నారు.
వరుస ట్వీట్లతో అలజడి చేస్తూ
ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసిన తర్వాత వరుస ట్వీట్లతో అలజడి సృష్టించాడు. అరేయ్ జగన్‌గా (పూరీ జగన్నాథ్). ఇట్టాంటి బ్లాక్బస్టర్లు తీసే దమ్ముండి కూడా ఎందుకు తియ్వవురా బాడ్కవ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విచిత్ర వేషాదరణతో కూడిన గెటప్‌తో కేక పెట్టించాడు. నెత్తిన టాక్, మెడల్ కర్చీఫ్, కాలికి స్పైడర్ మ్యాన్ కర్చీఫ్ కట్టుకొని ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు.
భారీ కలెక్షన్లతో హంగామా
జూలై 18న రిలీజైన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ చిత్రంలో రామ్, నిధి అగర్వాల్, నభ నటేష్ హీరో, హీరోయిన్లుగా నటించారు. చార్మి సహనిర్మాతగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పక్కా హైదరాబాదీ నేపథ్యంగా తెరకెక్కింది.