Revanth Reddy రేవంత్ సీఎం కావడానికి కారణం అదే.. ఆ విషయంలో నో డౌట్.. రాంగోపాల్ వర్మ
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు, వాటి ఫలితాలు వెల్లడైన తర్వాత రాజకీయాలపై రాంగోపాల్ వర్మ ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వరుస ట్వీట్లతో తన అభిమానులను ఆయన అలరిస్తున్నారు. తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ తన అభిమానాన్ని రుజువు చేసుకొంటున్నాడు. ఎన్నికల ముందు వరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేసిన ఆర్జీవి.. తాజాగా రేవంత్ రేడ్డి అభిమానిగా మారిపోయాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి గురించి వర్మ చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే రాంగోపాల్ వర్మ ట్వీట్ వైరల్ అయింది. నేను తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని పరిచయం చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి పోరాట యోధుడు అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆ తర్వాత రేవంత్.. అందుకో లక్షల కొద్దిసార్లు నీకు తలవించి నమస్కరిస్తున్నాను అని వర్మ పేర్కొన్నారు.

అయితే రేవంత్ రెడ్డితో తనకు ఉన్న సాన్నిహిత్యంతో ఆయనకు అభిమానిగా మారిపోయాడు. సోషల్ మీడియాలో రేవంత్‌ను ప్రశంసలతో ముంచెత్తేస్తున్నాడు. తాజాగా సీఎం అభ్యర్థిగా రేవంత్‌ను ప్రకటించిన తర్వాత ఓ అడుగు ముందుకెసి ఆయన పోరాట పటిమపై కామెంట్ చేశాడు.
రేవంత్ రెడ్డి గురించి రాంగోపాల్ వర్మ ప్రశంసిస్తూ ఆయనలోని గొప్ప పోరాటం, రాజకీయ చతురతనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేలా చేశాయి. ఆయనలోని స్పీడ్, ఎనర్జీ గురించి నాకు పూర్తిగా తెలుసు. వాటిని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను. రేవంత్ రెడ్డి గొప్ప ముఖ్యమంత్రి అవుతాడనే విషయంలో నాకు ఎలాంటి డౌట్స్ లేవు అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాంగోపాల్ వర్మ సినిమాల విషయానికి వస్తే.. వైఎస్ జగన్ జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనల అధారంగా వ్యూహం సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను రెండు భాగాలు రిలీజ్ చేయాలని అనుకొన్నాడు. కానీ సెన్సార్ అభ్యంతరాల వల్ల ఈ సినిమా రిలీజ్ ప్రస్తుతం ఆగిపోయింది.


Click it and Unblock the Notifications











