For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిన్నప్పటి నుంచి అవి చూసే అలవాటు ఉంది: కొత్త హీరోయిన్‌ ముఖం మీదే చెప్పేసిన ఆర్జీవీ

  |

  అప్పటి వరకూ ఓ మూస ధోరణిలో సాగిపోతోన్న తెలుగు సినీ ప్రయాణాన్ని తనదైన శైలి డైరెక్షన్‌తో కొత్త పుంతలు తొక్కించి.. ప్రయోగాత్మక చిత్రాలతో తన స్టామినాను దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. పరిశ్రమలో ఏర్పరచుకున్న బౌండరీలను దాటుకుని సినిమాలను తెరకెక్కించిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో బాలీవుడ్‌లో సైతం సినిమాలు చేసి ఔరా అనిపించాడు. అంతటి ఖ్యాతి గడించిన ఈ దర్శకుడు..

  కొంత కాలంగా సినిమాల పరంగా తన ప్రభావాన్ని కోల్పోతున్నాడు. కానీ, ముక్కుసూటిగా ఉంటూ వ్యక్తిగతంగా మాత్రం తన పంథాను రోజు రోజుకూ పెంచుకుంటూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఈవెంట్‌లో ఏకంగా హీరోయిన్‌ ముందే వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన వర్మ

  వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన వర్మ

  కెరీర్ ఆరంభంలో గొప్ప గొప్ప సినిమాలను రూపొందించి.. దేశమే గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు రాంగోపాల్ వర్మ. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన ప్రవర్తనలో పూర్తిగా మార్పులు వచ్చాయి. దూకుడైన వ్యవహార శైలితో ప్రతి అంశంపై స్పందించే ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు.

  తద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలు, అభిమానులకు శత్రువులా మారిపోయాడు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ బోల్డుగా మాట్లాడుతూ తరచూ హాట్ టాపిక్ కూడా అవుతున్నాడు. దీంతో ఈ దర్శకుడి పేరు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వస్తోంది.

  దొంగ ల*కొడుకుల్లారా అంటూ గణేష్ మాస్టర్ ఆగ్రహం: పవన్ కల్యాణ్ పేరు వాడుతూ షాకింగ్‌గా!

  ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు

  ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు

  క్రైమ్, లవ్, రొమాంటిక్, హర్రర్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేసి రాంగోపాల్ వర్మ అప్పుడెప్పుడో తన స్టామినాను దేశ వ్యాప్తంగా చాటి చెప్పుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన పంథాను మార్చుకున్నారు. ఇందులో భాగంగానే కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులపై ఫోకస్ చేశాడు.

  ఈ క్రమంలోనే ‘రక్త చరిత్ర' నుంచి వరుసగా ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి వివాదాస్పద సినిమాలను తెరకెక్కించాడు. ఇక, గత ఏడాది పవన్ కల్యాణ్‌ రాజకీయాలపై ‘పవర్ స్టార్' అనే చిత్రాన్ని రూపొందించాడు.

  సొంతంగా రిలీజ్ చేసేందుకు కొత్త పద్దతి

  సొంతంగా రిలీజ్ చేసేందుకు కొత్త పద్దతి

  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసే సినిమాలకు సెన్సార్ చిక్కులు ఎదురవుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఆయన చిత్రాలపై కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ సెన్సేషనల్ డైరెక్టర్ సరికొత్తగా ఆలోచించాడు.

  ఇందులో భాగంగానే ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట సొంతంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేసుకున్నాడు. దీని ద్వారానే తన సినిమాలను విడుదల చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘క్లైమాక్స్', ‘నగ్నం', ‘పవర్ స్టార్', ‘డేంజరస్', ‘కరోనా వైరస్' వంటి వినూత్నమైన చిత్రాలను తీస్తూ ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

  జబర్ధస్త్‌‌లో ఆ టీమ్ లీడర్‌కు అవమానం: అన్యాయం జరిగిందని కన్నీరు.. వాళ్లిద్దరిపై సంచలన ఆరోపణలు

  అమ్మాయిలపై బోల్డుగా.. ఆరియానాతో

  అమ్మాయిలపై బోల్డుగా.. ఆరియానాతో

  రాంగోపాల్ వర్మ అమ్మాయిలనే ఎక్కువగా ఆరాధిస్తుంటాడు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల అందాలను ఆస్వాదిస్తుంటాడు. అందుకే ఇటీవలి కాలంలో ఆయన ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలనే రూపొందిస్తున్నాడు. తద్వారా వాళ్ల అందాలను సరికొత్త పద్దతుల ద్వారా ప్రేక్షకులకు చూపిస్తున్నాడు.

  ఇక, ఇటీవలే రాంగోపాల్ వర్మ.. బిగ్ బాస్ బ్యూటీ ఆరియానా గ్లోరీతో ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో వీళ్లిద్దరూ బోల్డుగా మాట్లాడుతూ దాన్ని రక్తి కట్టించారు. దీంతో ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఫలితంగా ఆర్జీవీ పేరు మారుమ్రోగిపోయింది.

  మూవీ ఈవెంట్‌కు వర్మ.. రాజమౌళి తండ్రి

  మూవీ ఈవెంట్‌కు వర్మ.. రాజమౌళి తండ్రి

  సునీల్, వైశాలీరాజ్, సుక్రాంత్, హిమజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కనబడుటలేదు'. ఎమ్ బాలరాజు తెరకెక్కించిన ఈ సినిమాను స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో సతీష్, దిలీప్, శ్రీనివాస్, దేవీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.

  ఇక, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. దీనికి రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో పాటు రాంగోపాల్ వర్మ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీంతో ఇది ఎంతో సందడిగా సాగింది.

  Bigg Boss షోపై నోరు జారిన సెలెబ్రిటీ: సీక్రెట్ ఫోన్ కాల్‌ను లీక్ చేయడంతో బట్టబయలు

  నిన్ను చూడలేదంటూ హీరోయిన్‌తో వర్మ

  నిన్ను చూడలేదంటూ హీరోయిన్‌తో వర్మ

  ‘కనుబడుటలేదు' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ను పేరు పేరునా అభినందించారు. అలాగే, ఈ సినిమాను తాను చూశానని ప్రతి షాట్ ఎంతగానో నచ్చిందని చెప్పారు. అదే సమయంలో హీరోను పిలిచి మాట్లాడుతూ.. ‘సినిమాలో నేను కొన్ని సీన్స్ చూశాను.

  కానీ, ఏమనుకోకు నిన్ను మాత్రం నేను అస్సలు చూడలేదు. ఎందుకంటే నీ పక్కన ఉన్న వైశాలీనే నన్ను ఎంతగానో ఆకర్షించింది. వైశాలీ.. నువ్వు ఈ సినిమాలో ఇరగదీసేశావ్. ఎంతో గ్లామర్‌గా కనిపించావ్. మొత్తం సూపర్' అంటూ చెప్పాడు ఆర్జీవీ.

  ఆరియానా గ్లోరీ హాట్ హాట్ ఫొటోలు: ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా.. రెచ్చిపోయిన బ్యూటీ

  Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad | #RAPO | HBD DSP
  చిన్నప్పటి నుంచి అవి చూసే అలవాటు

  చిన్నప్పటి నుంచి అవి చూసే అలవాటు

  హీరోను పిలిచి హీరోయిన్‌ను పొగడడం గురించి రాంగోపాల్ వర్మ వివరించాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి హీరోయిన్లను చూడడం అలవాటు. ఇంటర్ చదివే సమయంలో శ్రీదేవి ‘పదహారళ్ల వయసు' వచ్చింది. ఆ సినిమాను నేను పదహారు సార్లు శ్రీదేవిని చూడ్డానికే చూశాను. పదిహేడో సారి మాత్రం చంద్రమోహన్‌ను చూశా. అలాగే, కనబడుటలేదు మూడోసారి చూసినప్పుడు నీ యాక్టింగ్ గురించి మాట్లాడతా. అప్పటి వరకూ హీరోయిన్‌నే చూస్తాను. ఏమీ అనుకోకు' అంటూ షాకిచ్చాడు. దీంతో అక్కడున్న వాళ్లందరూ పగలబడి మరీ నవ్వుకున్నారు.

  English summary
  Sensational Director Ram Gopal Varma Attend Kanabadutaledu Pre Release Event. He Praises Vaishaliraj Figure and Revealed Personal Secret in This Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X