సినిమా ఆపి ఎన్టీఆర్‌కు మళ్లీ వెన్నుపోటు పొడిచారు: రామ్ గోపాల్ వర్మ

'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ఏపీలో విడుదల కాకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ స్టే విధించడంతో ఆ రాష్ట్రంలో రిలీజ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తెలంగాణతో పాటు ఇతర ప్రాంతంలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే విడుదల చేశారు.

ఏపీలో సినిమా ఆగిపోయిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఒక కోర్టు చెప్పిన దానికి పౌరుడిగా కంప్లయింట్ చేయడానికి అవకాశం లేదు. కానీ అదే రాజ్యాంగంలో పై కోర్టును అప్రోచ్ అవ్వడానికి హక్కు ఉంది. నేను, నిర్మాత రాకేష్ రెడ్డి అదే పనిలో ఉన్నామని తెలిపారు.

హౌస్ ఫుల్: నిజం తెలుసుకోవాలనే కోరిక ప్రజల్లో ఉందని ప్రూవ్ అయింది

హౌస్ ఫుల్: నిజం తెలుసుకోవాలనే కోరిక ప్రజల్లో ఉందని ప్రూవ్ అయింది

ఈ రోజు థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. అన్ని చోట్ల హౌస్ ఫుల్ అయ్యాయి. ఎన్టీ రామారావు జీవితంలో ఏం జరిగిందనే ఒక నిజం తెలుసుకోవాలనే కోరిక ప్రజల్లో ఉందని ప్రూవ్ అయింది. కేవలం కొంత మంది చేసిన ఒత్తిడి వల్లనో, పన్నాగం వల్లనో తెలియదు.. ఇలాంటిది (ఏపీలో ఆగిపోవడం) ఎప్పుడూ జరుగలేదు. మేము న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ చేయడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

ఎన్టీ రామారావుకు తిరిగి మరొకసారి వెన్నుపోటు

ఎన్టీ రామారావుకు తిరిగి మరొకసారి వెన్నుపోటు

ఇది నాకు వెన్నుపోటు కాదు.. ఎన్టీ రామారావుకు తిరిగి మరొకసారి వెన్నుపోటు. ఆయన ఆ రోజు సింహగర్జన సభ పెట్టుకోకుండా రకరకాల ప్రయత్నాలు చేసి మానసిక క్షోభకు గురి చేసి చంపేశారు . ఈ రోజు ఆయన మీద తీసిన సినిమా రిలీజ్ అవ్వకుండా మళ్లీ వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు సింహ గర్జన, ఈ రోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు.... అని వర్మ వ్యాఖ్యానించారు.

ఆ రోజు రామారావుగారికి హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు

ఆ రోజు రామారావుగారికి హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు

ఆ రోజు రామారావుగారికి హెల్ప్ చేయడానికి ఆయన ఫ్యామిలీ లేదు, పార్టీ వారు అందరూ కలిసి ఆయన్ను మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు మేమంతా రాజ్యాంగ హక్కులు తీసుకుని వాటి బలంతో పోరాడటానికి సాయశక్తులా కృషి చేస్తున్నాం. ఇందులో వందశాతం విజయం దక్కుతుందని ఆశిస్తున్నామన్నారు.

సెన్సార్ అయిన తర్వాత ఆపే అథారిటీ ఎవరికీ లేదు

సెన్సార్ అయిన తర్వాత ఆపే అథారిటీ ఎవరికీ లేదు

విడుదల ఆపివేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం ఆశ్చర్యమే. కోర్టులు అన్నీ పక్షపాతం లేకుండా ఉంటాయని నమ్ముతాను. సుప్రీం కోర్టు రామ జన్మభూమి అనే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఆపే అర్హత ఎవరికీ లేదని ఇటీవలే తీర్పు ఇచ్చింది. సినిమా విడుదల తర్వాత ఏదైనా నష్టం జరిగితే పరువు నష్టం వేసి న్యాయం కోరే హక్కు ఉంది కానీ సినిమా రిలీజ్ ఆపే అథారిటీ ఎవరికీ లేదు. తెలంగాణ హైకోర్టు కూడా ఇదే విషయం స్పష్టంగా తెలిపింది. ఇది కేవలం కొంత మంది వెనక ఉన్నవారు చేసిన పని.

అందుకే అడ్డుకుంటున్నారు

అందుకే అడ్డుకుంటున్నారు

ఏ సినిమా అయినా మనం ఏలాంటి కథ చెబుతున్నాం. ఎవరి కథ చెబుతున్నాం అనే దాని నుంచే తీవ్రత ఉంటుంది. ఇది లెజెండ్ ఎన్టీఆర్ గురించిన కథ. లక్ష్మీ పార్వతికి, ఆయనకు ఎలా బంధం ఏర్పడింది? కొందరు దాన్ని ఎలా వాడుకున్నారు... ఆ వాడుకుని చేసిన కుట్రతో మానసిక క్షోభ పెట్టి ఎలా చంపేశారు అనేది కథ. ఈ సినిమా చూడనివ్వక పోవడం వెనక ఉ ద్దేశ్యం ఇమేజ్ దెబ్బతింటుందనే భయం, ఆ సినిమా వల్ల నష్టం వస్తుంది అనే ఆలోచనే. అది ఉన్నవారే సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తారని వర్మ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X