Revanth Reddy తెలంగాణ కాంగ్రెస్‌లో బాహుబలి.. థ్యాంక్స్ సోనియా, రాహుల్.. ఆర్జీవి ట్వీట్ల వర్షం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విజయపథం వైపు నడిపించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీపీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తున్న నేపథ్యంలో వరుస ట్వీట్లతో తనదైన శైలిలో మెసేజ్‌లు పెట్టారు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉద్దేశించి ఆర్జీవి చేసిన ట్వీట్లు ఏమిటంటే?
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన సమయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి పార్టీని గెలిపించాడు. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ విజయం కాదు.. రేవంత్ రెడ్డి గెలుపు. పార్టీ విజయ వైపు నడిపించిన స్టార్స్‌కు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీకి బాహుబలి లక్కీగా దొరికాడు అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

పోరాట యోధుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు గౌరవ ముఖ్యమంత్రిగా కావడం సూపర్ డూపర్‌గానే కాకుండా గర్వంగా ఉంది. రేవంత్ రెడ్డి నీకు లెక్కలేనన్ని సార్లు తలవించి నమస్కరిస్తున్నాను అని వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోను ట్వీట్‌తోపాటు పోస్టు చేశాడు.
2021 సంవత్సరం జూన్ 26వ తేదీన చేసిన ట్వీట్‌ను ఆర్జీవి రీ పోస్ట్ చేశాడు. లయన్ రేవంత్ రెడ్డిని పీసీపీ ప్రసిడెంట్‌గా చేసి కాంగ్రెస్ పార్టీ సూపర్, ఫెంటాస్టిక్ నిర్ణయాన్ని తీసుకొన్నది. ఈ సింహాన్ని చూసి పులులు భయపడటం ఖాయం అంటూ జోస్యం చెప్పిన ట్వీట్‌ను చూపించాడు. రేవంత్ రెడ్డి గురించి ముందే ఊహించానని తనకు తాను సమర్థించుకొన్నాడు.

అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కొండా సురేఖకు ఆర్జీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మీ సాధించిన విజయం చూసి గర్వపడుతున్నాను అంటూ కామెంట్ చేశాడు.
తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారీటీ స్థానాలను దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు గెలుచుకొన్న విషయం తెలిసిందే. దాంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమైంది.


Click it and Unblock the Notifications











