YSRCP పరిపాలన నచ్చలేదంటే .. మీ ప్రభుత్వం రాజీనామా చేస్తుందా? మంత్రి పేర్ని నానికి ఆర్జీవి సూటి ప్రశ్న

ప్రముఖ ఛానెల్‌లో హోస్ట్ అడిగిన ప్రశ్నలపై రాంగోపాల్ వర్మ ఘాటుగా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒక వస్తువు బాగా లేకపోతే వాపసు ఇస్తే డబ్బు రిటర్న్ ఇస్తారనే విషయంపై, అలాగే ఉత్పత్తిదారుడు, వినియోగదారుడు మధ్య ప్రభుత్వం అధికారం ఏమిటి? అనే విషయం గురించి మాట్లాడుతూ ఓ వీడియోను మంగళవారం రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. వస్తు సేవలపై ప్రభుత్వం విధించే ట్యాక్స్ విధానాన్ని నేను గౌరవిస్తాను అంటూ.. సినిమా టికెట్ ధరల తగ్గింపుపై పేర్ని నానికి సూటి ప్రశ్నలు సంధించారు. తాజాగా యూట్యూబ్‌, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలో రాంగోపాల్ వర్మ చెప్పిన ప్రకారం..

 మీ ప్రభుత్వం ఒప్పుకొంటుందా?

మీ ప్రభుత్వం ఒప్పుకొంటుందా?

నేను 5 లక్షలతో ఐస్ క్రీమ్ తీశాను. బాహుబలి అనే సినిమాను రాజమౌళి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత 450 కోట్ల వ్యయంతో ఇప్పుడు RRR సినిమా తీశాడు. కానీ అదే 15 రూపాయలకు RRR సినిమా చూపించాలని అంటే.. పూర్తిగా మార్కెట్ ఎకానమీని నాశనం చేస్తుంది. ఈ వివాదానికి పేదవాడు అని ప్రభుత్వం చెప్పే కారణాన్ని అంగీకరించను. పేదవాడికి రోజు 15 రూపాయలు ఉండవచ్చు లేదా లక్షల్లో ఉండవచ్చు. ఒకవేళ పేదవాడు 15 రూపాయలే టికెట్ కోసం ఖర్చుపెడుతాడు అంటే.. నేను 150 రూపాయల సినిమా తీస్తా.. దాన్ని ప్రభుత్వం ఒప్పుకొంటుందా? అని ఆర్జీవి ప్రశ్నించాడు.

 చేతనైతే పేదవాడికి ఫ్రీగా చూపించండి

చేతనైతే పేదవాడికి ఫ్రీగా చూపించండి

మంత్రి పేర్ని నాని, కొడాలి నాని, వైఎస్ జగన్ తమ సొంత కెమెరాలతో రాజమౌళిని తలదన్నేలా అద్భుతంగా సినిమాలు తీయండి. అప్పుడు మీకు చేతనైతే ఆ సినిమాను 15 రూపాయలకు లేదా 5 రూపాయలకు లేదా ఫ్రీగా పేదవాడికి చూపించండి. మీకు టాలెంట్ లేనప్పడు.. సిని పరిశ్రమలో ప్రతిభ ఉన్న వారి సామర్ధ్యాన్ని తగ్గించడం దారుణమై తప్పు అని రాంగోపాల్ వర్మ అన్నారు.

వైఎస్ఆర్ లేకపోతే జగన్‌కు ఓట్లు పడుతాయా?

వైఎస్ఆర్ లేకపోతే జగన్‌కు ఓట్లు పడుతాయా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు కాకపోతే వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి అన్ని ఓట్లు వచ్చి ఉండేవా అంటే నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్ కంటే వైఎస్ జగన్ నాకు ఇష్టం. కానీ వైఎస్ లేకపోతే జగన్‌కు ఆ బ్రాండ్ వచ్చి ఉండేది కాదు. అలాగే పవన్ కల్యాణ్‌కు, మహేష్ బాబుకు, సొంతంగా కష్టపడిన విజయ్ దేవరకొండ, పాపులర్ కమెడియన్ అల్లు రామలింగయ్య వారసుడిగా నాకు ఇష్టమైన అల్లు అర్జున్ కూడా అలానే బ్రాండ్ వచ్చింది. అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు కొవొచ్చు.. వైఎస్ జగన్ కావొచ్చు.. అంతా బ్రాండ్ మీదే వర్కవుట్ అవుతుంది. రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం కొద్ది వైఎస్ జగన్‌కు ఓట్లు వేశారు. చాలా సార్లు వైఎస్ జగన్ కూడా ఒప్పుకొన్నారు.

Recommended Video

RGV - Judicial Process లో ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళే జడ్జ్ అవడం తప్పు | Filmibeat Telugu
 ఎన్నికల సమయంలో హామీలు నెరవేరుస్తారా?

ఎన్నికల సమయంలో హామీలు నెరవేరుస్తారా?


సినిమా టికెట్ల తగ్గింపు వ్యవహారంలో మంత్రి పేర్ని నాని వినియోగదారులు కోర్టు గురించి చెప్పడం అంతకంటే చెత్త వాదన ఏమీ ఉండదు. మీరు ట్రైలర్ చూపించి సినిమా డబ్బులు లాగేస్తున్నారు అంటే.. మీరు ఎన్నికల సమయంలో అది చేస్తాం.. ఇది చేస్తాం అని హామీలు ఎన్నో ఇస్తారు. కానీ చేస్తారా అంటే చేయరు. కానీ మీకు ఐదేళ్ల గడువు ఉంటుంది. ఆ ఐదేళ్లలో మీ వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ సినిమా విషయంలో మాకు అంత గడువు ఉండదు. కేవలం మూడు రోజుల్లో సినిమా రాత తేలిపోతుంది అని రాంగోపాల్ వర్మ చెప్పారు.

 మీ పాలన నచ్చ లేదంటే.. దిగిపోతారా?

మీ పాలన నచ్చ లేదంటే.. దిగిపోతారా?


టికెట్ల రేట్ల వ్యవహారాన్ని వినియోగదారులకు ముడిపెట్టి.. వస్తువు నచ్చకపోతే వాపసు చేస్తారు అనే విషయాన్ని ప్రస్తావించారు. అయితే టమాటాలు కొనుగోలు చేసిన తర్వాత పుచ్చిపోయి లేదా పాడైపోయి ఉంటే వాపసు చేయవచ్చు అని చెప్పారు. దానిని ప్రాతిపాదికన తీసుకొంటే మీ వైసీపీ పరిపాలన నచ్చలేదని ఓటరు అంటే అంటే.. మీరు తప్పుకొంటారా? దిగిపోతారా? అని ప్రశ్నించారు. మీరు ఏదైనా హోటల్‌కు వెళ్లి బాగా తినేసి నాకు నచ్చలేదు.. నేను బిల్లు కట్టను అంటే ఒప్పుకొంటారా? అని ఆర్జీవి లాజిక్ మాట్లాడారు.

వస్తువు నచ్చకపోతే వాపసు చేస్తే

వస్తువు నచ్చకపోతే వాపసు చేస్తే

ఇక వస్తువు నచ్చకపోతే వాపసు చేసే అవకాశం ఉంటుంది. కానీ సినిమా విషయంలో అలాంటి వెసులు బాటు ఉండదు. మార్కెట్‌లో టామాటా కొని.. కొరికి తిని.. ఆ తర్వాత రుచి నచ్చలేదని వాపసు ఇస్తామంటే కుదురుతుందా? సినిమా విషయంలో కూడా అదే వర్తిస్తుంది. సినిమా చూసిన తర్వాత బాగాలేదు. డబ్బు వాపసు ఇవ్వమంటే కుదరదు. ప్రొడక్ట్ మార్కెట్‌లో వాపసు ఇస్తే ఉత్పత్తి దారుడికి ప్రొడక్ట్ వెళ్తుంది. కానీ సినిమా పరిశ్రమలో వాపసు అనే విధానం ఉండదు అని వర్మ స్పష్టం చేశారు.

 వైఎస్ జగన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారా?

వైఎస్ జగన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారా?

టికెట్ల వ్యవహారంలో, సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్‌ను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? లేకపోతే సినిమా గురించి వారికి తెలియదా? వాళ్లకు మరే ఇతర ఎజెండా ఉందా అనే విషయాలను నేను పట్టించుకోను. కానీ ఓ ఫిల్మ్ మేకర్‌గా వారికి సినిమా గురించి అసలు ఏ విషయాలు తెలియవు. వారికి తెలిస్తే.. అందరికి సరైన సమాధానం ఇచ్చేవారు అని వర్మ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X