వర్మ 'రక్త చరిత్ర'

'రక్తచరిత్ర' గురించి చిత్ర సమర్పకుడు రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ''యదార్థ వ్యక్తులు, యదార్థ సంఘటనలతో కూర్చిన అత్యంత నిజమైన కల్పిత కథ ఇది. ఫ్యాక్షన్ నేపథ్యాన్ని వాస్తవ పరిస్థితుల్లో చూపిస్తున్నాం. ఇంతవరకూ ఎవరూ ఇలాంటి నేపథ్యాన్ని చూపించి ఉండరు. అందరూ కొత్తవాళ్లతో ఈ సినిమాకు శ్రీకారం చుడుతున్నామ''ని చెప్పారు.
పరిటాల రవి జీవిత నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారా అని ప్రశ్నించగా అలాంటి పాత్ర ఉందేమో సినిమాలో చూద్దురులెండి అన్నారు. మద్దెలచెర్వు సూరిని కలవబోతున్నారటగా.. అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఆయన దాటవేశారు. ఈ చిత్రాన్ని హిందీలో రూపొందించే ఆలోచనలేదనీ, కొన్ని చిత్రాలు ప్రాంతీయ భాషలకే పరిమితమవుతాయని అన్నారు. త్వరలో తెలుగులో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తానని పేర్కొన్నారు.
రక్ష గురించి మాట్లాడుతూ... చేతబడి ఉందని ఎలా నిరూపించవచ్చో ఎవరైనా చెబితే తాను రూ.20లక్షలు ఇస్తానని, 'రక్ష'లాంటి సినిమాలు నచ్చినవాళ్లే చూస్తారని ఆయన తెలిపారు. ముందుగా జరిగిన 'రక్ష' చిత్రానికి సంబంధించిన సమావేశంలో నిర్మాత ఆజమ్‌ఖాన్, సుబ్బరాజు, వంశీకృష్ణ ఆకెళ్ల, బేబి నేహ, మాస్టర్ అతులిత్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











