తెలంగాణాలో వర్మ 'రక్త చరిత్ర' ను బ్యాన్ చేస్తారా?
రామ్ గోపాల్ వర్మ తాజాగా 'సమైఖ్యాంధ్రకు జై' అంటూ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన లేటెస్ట్ చిత్రం 'రక్త చరిత్ర' రిలీజ్ ను తెలంగాణా జిల్లాల్లో ఆపుచేస్తారా? అనే సందేహం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన స్టేట్ మెంట్ కు ఎవరూ స్పందించకపోవటం ఆశ్చర్యం కలగచేస్తోందంటున్నారు. ఇంతకుముందు మోహన్ బాబు, చిరంజీవి, హరికృష్ణ లు సమైఖ్యాంద్రకు మద్దతు తెలిపారని వారి కుమారుల చిత్రాలపై తెలంగాణాలో ఆపుచేసారు. సలీం,ఆర్య-2లకు ఈ దెబ్బ బాగా తగిలింది. ఇక క్రిసమస్ కి రిలీజ్ కావాల్సిన ఎన్టీఆర్ 'అదుర్స్' రిలీజ్ డేట్ డైలమో లో పడింది. అయితే వీటిలాగే వర్మ చిత్రం కూడా ఆపుతారు అని కొందరంటున్నారు. లేదు రాయలసీమ ప్యాక్షన్ పై వస్తున్న ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి ఉంది. ఆయన అభిమానులు అంతటా ఉన్నారు. కాబట్టి దాని రిలీజ్ ని ఆపరు అని మరికొంత మంది వాదిస్తున్నారు. ఇవన్నీ కాదు..ఇలా ఆసక్తి రేపటానికే వర్మ కావాలనే సమైఖ్యాంద్ర స్టేట్ మెంట్ ఇచ్చాడని మరికొందరు సందేహ నివృతి చేస్తున్నారు. ఇంతకీ 'రక్త చరిత్ర' ను అందరూ చూడగలరో..లేదో వేచి చూడాల్సిందే. ఈ లోగా హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు ఈ ప్రాంత్రీయ భేదాలు లేక అంతటా కలెక్షన్స్ దండుకుంటున్నాయనేది నిర్విదాశం.


Click it and Unblock the Notifications











