పరిటాల రవి చిత్రం డిటేల్స్

By Staff

Ram Gopal Varma
ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నతెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దివంగత పరిటాల రవి చరిత్ర సినిమా త్వరలోనే వెండి తెరను పలకరించనుంది. అయితే రక్త చరిత్ర పేరుతో రూపొందనున్న ఈ చిత్రం హిందీలో చేయటానికి రామ్ గోపాల్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. అంతేగాక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తానని చెప్తున్నారు ఆయన. ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ రక్త చరిత్ర సినిమాను చాలా విపులంగా ముఖ్యమైన సన్నివేశాలు మిస్సవకుండా తీస్తే దాదాపు ఐదు గంటలు పైగా వస్తుంది. అందుకే దాన్ని రెండు పార్ట్ లుగా విభిజిస్తున్నాను. మూడు నెలలు గ్యాప్ లో రెండూ రిలీజ్ చేస్తాను. మొదటి రక్త చరిత్ర-1 తర్వాత రక్త చరిత్త-2 వస్తుంది. ఓ హిందీ నటుడు పరిటాల పాత్రను పోషిస్తాడు.

అయితే మొదట ఈ చిత్రాన్ని ధర్మ-రక్ష అనే కవల దర్శకులు తీస్తారని వర్మ ప్రకటించారు. కానీ ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకుని ఆయనే స్వీయ దర్శకత్వంలో తీయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలుగువాడైన పరిటాల రవి చరిత్రను హిందీలో చేయటానికి కారణం ప్రత్యేకంగా ఏమన్నా ఉంటే దానికి ఆయన సమాధానంగా..సౌత్ ఇండియాలోనే కాక ఈ సినిమా అంతటా నచ్చుతుందని భావిస్తున్నాను. నేను దావూద్ ఇబ్రహీం, వేలు ప్రభాకరన్(ఎల్టీటిఈ చీఫ్), కొలంబియా డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ వంటి వారి బయోగ్రఫీలు చదివాను.

కానీ పరిటాల జీవిత చరిత్ర ముందు అవన్నీ తేలిపోయాయి. అందుకే దీన్ని హిందీలో రూపొందించి మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నా అన్నారు. ప్రస్తుతం మీడియా వార్ నేపధ్యంలో ఇండియా 24X7 అనే సినిమాను తీస్తున్న ఆయన ఆగస్టులో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇక నితిన్ హీరోగా చేసిన అజ్ఞాత్ సినిమా త్వరలో విడుదల కానుంది.

అయితే ప్రధాన పాత్రలయిన పరిటాల రవి, మద్దెల సూరి పాత్రల కోసం చాలా మందిని పరిశీలించిన మీదట ఆయన సర్కార్ రాజ్ సినిమాలో చేసిన రవికాలేకర్, దిలీప్ ప్రభాకవల్ కర్ లను ఎంపిక చేయనున్నారన్నట్లు వినపడుతోంది. అధికారికంగా ప్రకటన వెలవడేదాకా ఏదన్నది తెలియదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X