Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వర్మ 'రక్త చరిత్ర' విడుదలయ్యే తేది ఫైనల్ గా...
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'రక్త చరిత్ర' చిత్రం రిలీజ్ సెప్టెంబర్ 27న రిలీజ్ చేయటానికి నిర్ణయం చేసినట్లు సమాచారం. మొదట ఈ చిత్రం సెప్టెంబర్ 17న రిలీజ్ చేస్తామన్నారు. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానుందున వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్ రిలీజైన మూడు వారాల తర్వాత పార్ట్-2 రిలీజు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే హిందీ, తెలుగులో మాత్రమే రెండు భాగాలుగా తీశారు. తమిళం కోసం ప్రత్యేకంగా వెర్షన్ రెడీ చేస్తున్నారు. అక్కడ ఒక భాగం మాత్రమే ఉంటుంది. హిందీ, తెలుగులో తీసిన మొదటి భాగంలో వివేక్ ఓబరాయ్ మాత్రమే కనిపిస్తారు. రెండవ భాగం నుంచి సూర్య ఎంట్రీ ఉంటుంది. తమిళంలోనూ సెప్టెంబర్ నెలలోనే విడుదల చేయనున్నారు. రక్త చరిత్ర చిత్రంలో పరిటాల రవిగా వివేక్ ఓబరాయ్, సూరిగా సూర్య చేశారు. సూరి భార్య భానుమతి కేరక్టర్ ప్రియమణి అయితే, రవి భార్య సునిత పాత్ర అనితా ఆప్టే పోషించారు. ఇప్పటికే విడుదలైన రక్త చరిత్ర ప్రోమోలు సంచలనం సృష్టిస్తున్నాయి.