రామ్ చరణ్ ఆరంజ్ దెబ్బకు భయపడిన రామ్ గోపాల్ వర్మ..
ఈమధ్య కాలంలో చిరంజీవి తో దోర సినిమా చెయ్యాలని ఉందని, ఆయనకు సాటి ఎవరూ లేరని అన్న రామ్ గోపాల్ వర్మ ఇంకోక అడుగు ముందుకు వేసి వంద మంది రామ్ చరణ్ లు కూడా చిరంజీవికి సాటిరారన్న రామ్ గోపాల్ వర్మ రామ్ చరణ్ అరంజ్ సినిమా దెబ్బకు భయపడ్డారన్న వార్తలు ఫిలిమ్ నగర్ సంచారమాడతున్నాయి. దానికి కారణం ఇటీవల తాను దర్శకత్వం వహించినటువంటి రక్త చరిత్ర మొదటి భాగం విడుదలై మంచి బాక్సాఫీసు రికార్డుల్ని వసూలు చేసిన సంగతి అందరికి తెలిసిందే.
ఐతే తన రక్త చరిత్ర పార్ట్ 2వ భాగం నవంబర్ 19న విడుదల చేస్తానని ఎప్పట్నుంచో కాన్పిడెంట్ గాచెబుతూ వచ్చిన వర్మ ఒకడుగు వెనక్కు వేశారని అందరూ అనుకుంటున్నారు. అంతేకాకుండా రామ్ గాపాల్ వర్మ ఉత్త మాటల మనిషే కాని చేతల మనిషికాదని టాలీవుడ్ జనాలు కోడై కూస్తున్నారు. ఇక ఆరంజ్ విషయానికి వస్తే రామ్ చరణ్ తేజ్ ఇందులో లవర్ బాయ్ గాకనిపించి మెగా అభిమానులకు ఆనందాన్ని పంచబోతున్నారు. ఇప్పటికే ఆడియో విడుదలై మార్కెట్ లోతన సత్తా చాటుతుందని మోగా అభిమానులు అనుకుంటున్నారు. ఈసినిమాతో రామ్ చరణ్ తేజ్ అన్ని పాత్రలలో ఒదిగిపోతారని, అలా ఒదిగిపోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











