రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' రిలీజ్ డేట్
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'రక్త చరిత్ర' పస్ట్ ఫార్ట్ రిలీజ్ ఆగస్టు 11న అవనుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధ్రువీకరించారు. మొదటి పార్ట్ రిలీజైన రెండు వారాల తర్వాత పార్ట్-2 రిలీజవుతుందని అన్నారు. అలాగే హిందీ, తెలుగులో మాత్రమే రెండు భాగాలుగా తీశారు. తమిళం కోసం ప్రత్యేకంగా చేశారు. తమిళంలో ఒక భాగం మాత్రమే ఉంటుంది. హిందీ, తెలుగులో తీసిన మొదటి భాగంలో వివేక్ ఓబరాయ్ మాత్రమే కనిపిస్తారు. రెండవ భాగం నుంచి సూర్య ఎంట్రీ ఉంటుంది. తమిళంలోనూ ఆగస్టు నెలలో విడుదల చేయనున్నారు. రక్తచరిత్ర కథ గురించి వర్మ చెబుతూ..పూర్తిగా అనంతపూర్ లో జరిగిన యథార్థ కథ. ఇద్దరు ఫ్యాక్షనిస్టుల కథను తెరకెక్కించాను. పరిటాల రవి, సూరి కథను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ఇది. పగలు, ప్రతీ కారాల వెనుక కచ్చితంగా రాజకీయ శక్తులు ఉం టాయి. వాటి గురించి చర్చించే కథ ఈ సినిమా. ఇందులో పరిటాల రవిగా వివేక్ ఓబరాయ్, సూరిగా సూర్య చేశారు. ఈ సినిమా కోసం పరిటాల రవి సన్నిహితులను, సూరిని కలుసుకుని వివరాలు సేకరించాను అన్నారు. సూరి భార్య భానుమతి కేరక్టర్ ప్రియమణి అయితే, రవి భార్య సునిత పాత్ర అనితా ఆప్టే పోషించారు.


Click it and Unblock the Notifications











