పవన్ యునిక్, బాలయ్య బుల్ బుల్, శ్రీరెడ్డి సంఘ సేవిక: ఆర్జీవీ

'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ మార్చి 29న విడుదలవుతున్న నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా వర్మపై మీడియా వారు విచిత్రమైన ప్రశ్నలు సంధించి ఆసక్తికర సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, శ్రీరెడ్డి, నాగబాబు, కెఏ పాల్ తదితరులపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే చంద్రబాబు, జగన్, లోకేష్ లాంటి వారిపై వ్యాఖ్యలు చేసేందుకు రామ్ గోపాల్ వర్మ ఆసక్తి చూపలేదు.

పవన్ యునిక్, బాలయ్య బుల్ బుల్, శ్రీరెడ్డి సంఘ సేవిక

పవన్ యునిక్, బాలయ్య బుల్ బుల్, శ్రీరెడ్డి సంఘ సేవిక

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, శ్రీరెడ్డి గురించి వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మకు ప్రశ్న ఎదురవ్వగా... పవన యూనిక్, బాలకృష్ణ బుల్ బుల్, శ్రీరెడ్డి సంఘ సేవిక అంటూ సమాధానం ఇచ్చారు.

చంద్రబాబు, జగన్, లోకేష్ గురించి

చంద్రబాబు, జగన్, లోకేష్ గురించి

చంద్రబాబు, జగన్, లోకేష్ లాంటి వారిపై వ్యాఖ్యలు చేసేందుకు రామ్ గోపాల్ వర్మ ఆసక్తి చూపలేదు. నేను పాలిటిక్స్ ఎక్కువగా ఫాలో అవ్వను కాబట్టి వారి గురించి ఏమీ చెప్పలేక పోతున్నాను అంటూ వర్మ ఈ ప్రశ్నలను స్కిప్ చేసే ప్రయత్నం చేశారు.

ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు?

ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు?

పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరిలో ఎవరు సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు? అనే ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అవుతూ ‘పవన్ కళ్యాణ్' సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ

రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ

రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఈ ఇద్దరిలో ఎవరు పీఎం కావాలని కోరుుంటున్నారు? అనే ప్రశ్నకు స్పందిస్తూ.... నరేంద్ర మోడీ పీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

విజయ్ దేవరకొండ, అనుష్క రాజకీయాల్లోకి

విజయ్ దేవరకొండ, అనుష్క రాజకీయాల్లోకి

విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబుల్లో.... విజయ్ దేవరకొండ రాజకీయాల్లోకి ఎంటరవ్వాలని కోరుకుంటున్నట్లు, అదే విధంగా హీరోయిన్లలో అనుష్క రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటానని ఓ ప్రశ్నకు ఆర్జీవీ సమాధానం ఇచ్చారు. టాలీవుడ్, బాలీవుడ్ పొలిటికల్ పార్టీలు అయితే నా ఓటు బాలీవుడ్‌కే అని స్పష్టం చేశారు.

ముద్దు సీన్లు ఇంకా ఎక్కువ అవ్వాలి

ముద్దు సీన్లు ఇంకా ఎక్కువ అవ్వాలి

ఈ మధ్య తెలుగు సినిమాల్లో లిప్ లాక్ సీన్లు ఎక్కువ అవుతున్నాయనే విమర్శలు వస్తోందని, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనే ప్రశ్నకు వర్మ స్పందిస్తూ.... ‘ఇంకా ఎక్కువ అవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ సమాధానం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ బయోపిక్ తీస్తే

పవన్ కళ్యాణ్ బయోపిక్ తీస్తే

ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ మీద బయోపిక్ పిక్ తీస్తే ఎవరిని హీరోగా పెడతారు? అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ... ఇది చాలా కష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి మనిషి ప్రపంచంలో ఒక్కరే ఉంటారు. ఆయనలా ఎవరూ చేయలేరు అని నా అభిప్రాయమన్నారు.

పవన్, ఊర్మిళ

పవన్, ఊర్మిళ

పవన్, నాగబాబులో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే... నాగబాబుతో మాట్లాడటం అంటే ఇస్టం... పవన్ కళ్యాణ్‌ను చూడటం అంటే ఇష్టమని వర్మ తెలిపారు. శ్రీదేవి ఇప్పుడు లేరు కాబట్టి తనకు ప్రజెంట్ జీవించి ఉన్న ఊర్మిళ అంటే ఇష్టమని తెలిపారు.

నావి అన్నీ ముందు పోట్లే...

నావి అన్నీ ముందు పోట్లే...

తనను ఇప్పటి వరకు చాలా మంది వెన్నుపోటు పొడవటానికి ప్రయత్నించారు. కానీ నా వీపు గట్టిది కాబట్టి ఎవరూ పొడవలేక పోయారు. వాళ్లకు వెన్ను పోటు పొడవాలనే ఆలోచన రాకముందే నేను ముందుపోటు పొడుస్తానని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X