»   » అంత సీన్ లేదు: పవన్ కళ్యాణ్‌‌తో వివాదం, బ్యాన్ రూమర్లపై వర్మ రియాక్షన్!

అంత సీన్ లేదు: పవన్ కళ్యాణ్‌‌తో వివాదం, బ్యాన్ రూమర్లపై వర్మ రియాక్షన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్‌ను నటి శ్రీరెడ్డితో బూతులు తిట్టించిన వ్యవహారంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై మెగా ఫ్యామిలీ సీరియస్ అయింది. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి వర్మను నీచుడు, నికృష్ఠుడు అంటూ ఏకిపారేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వర్మను బహిష్కరించే అవకాశం ఉందనే వార్తలు సైతం వినిపించాయి. తాజాగా ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవ్వగా తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు.

ఇక్కడ ఎవ్వరూ, ఎవ్వరినీ బహిష్కరించలేరు

ఇక్కడ ఎవ్వరూ, ఎవ్వరినీ బహిష్కరించలేరు

సినిమా ఇండస్ట్రీ ఏ ఒక్కరిదీ కాదని, ఇక్కడ ఎవరూ ఎవ్వరినీ బహిష్కరించలేరని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. అయినా అంత పెద్ద తప్పు నేను ఏమీ చేయలేదని, పైగా నేను మాట్లాడిందంతా కూడా న్యాయబద్ధమైన హక్కుల పరిధిలోనే అని వర్మ తెలిపారు.

నన్ను బహిష్కరిస్తానని ఎవరూ అనలేదు

నన్ను బహిష్కరిస్తానని ఎవరూ అనలేదు

నన్ను ఇండస్ట్రీ నుండి బహిష్కరిస్తానని ఎవరూ నేరుగా అనలేదు. పవన్‌ కళ్యాణ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌కి వచ్చినప్పుడు కూడా నా పేరు ఎవరూ ప్రస్తావించలేదు. కానీ ట్విట్టర్‌లో తనపై పన్నిన కుట్రలో నేను కూడా భాగమని ట్వీట్‌ చేశారు. అది పవన్ కళ్యాణ్ నమ్మకం. అతడి నమ్మకం ఎందుకు నిజం కాదో నా అభిప్రాయం కూడా వెల్లడించాను.... అని వర్మ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

నేను ఎలాంటి కుట్రలు చేయలేదు

నేను ఎలాంటి కుట్రలు చేయలేదు

నేను పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి కుట్రలు చేయలేదు. కుట్ర పన్నడమే నిజమనుకొంటే పవన్‌ కళ్యాణ్‌ని తిట్టమని చెప్పింది నేనే అని ఎందుకు ఒప్పుకొంటాను? అయినా ఇలాంటి విమర్శలు రావడం సహజమే. ఎవరు అనాలనుకుంది వాళ్లు అనేస్తారు...అందులో నిజం ఎంత అనేదే ముఖ్యం అని వర్మ అన్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ప్రస్తుతానికి పక్కన పెట్టా

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ప్రస్తుతానికి పక్కన పెట్టా

ఇప్పటి వరకు చాలా సినిమాలు ప్రకటించారు. అందులో మొదలు పెట్టని సినిమాలు చాలా ఉన్నాయి? ఇవన్నీ ఎప్పుడు తీస్తారు? అనే ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.... సినిమా అనేది ఒక ఆలోచన నుంచి పుడుతుంది. అవి తెరకెక్కొచ్చు, లేకపోవచ్చు. 2005లో తీసిన ‘సర్కార్‌' కోసం 1995 నుంచి ఆలోచించా. ‘న్యూక్లియర్‌' సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనుల వల్ల ఇంకా సమయం పడుతుంది. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'కి కొన్ని సాంకేతిక సమస్యలున్నాయి. అందుకే ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టేశాను అని వర్మ తెలిపారు.

త్వరలోనే అఖిల్‌తో మూవీ

త్వరలోనే అఖిల్‌తో మూవీ

‘ఆఫీసర్' తర్వాత అఖిల్‌తో సినిమా చేయాలనుకొంటున్నా. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. సినిమా రెండు నెలల్లో ప్రారంభమవుతుంది అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

English summary
After a controversy with Pawan Kalyan... Rumours say that Tollywood will be banned Director Ram Gopal Varma. Ram Gopal Varma reacted on this rumours.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X