ఊర్మిళ, కంగన వివాదంలోకి రాంగోపాల్ వర్మ.. పోర్న్‌స్టార్ వ్యాఖ్యలపై ఆర్జీవి కామెంట్!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దర్యాప్తు విషయంలో బయటపడిన డ్రగ్స్ లింకుల వ్యవహారం బాలీవుడ్‌లో సినీ నటులు మధ్య రచ్చకు దారి తీసింది. బాలీవుడ్‌ దుమ్మెత్తి పోస్తున్న కంగన రనౌత్, రవి కిషన్‌కు, జయబచ్చన్ ఇచ్చిన సమాధానం వివాదంగా మారింది. దాంతో కంగనకు ఓ వర్గం, జయబచ్చన్‌కు మరో వర్గం మద్దతుగా నిలిచి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కంగన, ఊర్మిళ మధ్య నెలకొన్న వివాదంపై ఆర్జీవి స్పందిస్తూ..

రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత

రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత

బాలీవుడ్‌లోని 90 శాతం మంది ప్రముఖులకు డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయి. సరైన టెస్టులు చేస్తే అగ్ర నటులంతా జైల్లోనే ఉంటారు అని కంగన రనౌత్ వ్యాఖ్యలు చేసింది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత బాలీవుడ్‌లో మాటల యుద్దం ఊపందుకొన్నది. ఈ క్రమంలో కంగన లాంటి వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేయద్దు. బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టను దెబ్బ తీయవద్దు అంటూ ఊర్మిళ ఘాటుగా స్పందించింది.

ఓ పోర్న్‌స్టార్ టికెట్ సాధించగలిగితే.. నేను కూడా

ఓ పోర్న్‌స్టార్ టికెట్ సాధించగలిగితే.. నేను కూడా

ఊర్మిళ వ్యాఖ్యలపై కంగన స్పందిస్తూ.. ఊర్మిళ తన ఇంటర్వ్యూలో దారుణంగా కామెంట్ చేసింది. నా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. నేను బీజేపీ టికెట్ కోసం ఆశిస్తున్నానని ఆరోపణలు చేసింది. ఓ పోర్న్‌స్టార్ టికెట్ సాధించగలిగితే.. మరాఠా సంస్కృతిని చాటేలా సినిమాలు తీసిన నాకు టికెట్ సాధించడం ఓ లెక్కనా అంటూ కంగన ఘాటుగా స్పందించారు.

కంగనపై బాలీవుడ్ ప్రముఖుల ధ్వజం

కంగనపై బాలీవుడ్ ప్రముఖుల ధ్వజం

ఊర్మిళను సాఫ్ట్‌ పోర్న్ స్టార్ అంటూ కంగన కామెంట్ చేయడంపై బాలీవుడ్ తారలు ఘాటుగా స్పందించారు. స్వర భాస్కర్ తదితర నటులు కంగన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కంగన వ్యాఖ్యలపై ఊర్మిళ స్పందిస్తూ.. ఆమెకు సమాధానం చెప్పాల్సిన స్టేటస్ లేదని అన్నారు. ఈ క్రమంలో ఈ వివాదంలోకి రాంగోపాల్ వర్మ దూరారు.

Recommended Video

Amaram Akhilam Prema Would Be Released On September 18 In Aha
ఊర్మిళ గురించి రాంగోపాల్ వర్మ ట్వీట్

ఊర్మిళ గురించి రాంగోపాల్ వర్మ ట్వీట్

ఊర్మిళ కెరీర్‌ను ఓ లెవెల్‌కు తీసుకెళ్లడంలో రాంగోపాల్ వర్మ కీలకమైన పాత్రే అనిచెప్పవచ్చు. తెలుగులో గాయం, అనగనగా ఓ రోజు, సత్య, అంతం, రంగీలా, మనీ మనీ, దౌడ్, కౌన్, భూత్, ఏక్ హసీనా థీ చిత్రాల్లో ఆమె నటన చాలా గొప్పగా ఉంటుంది. ఆమె ఓ విలక్షణమైన నటి. ఇలాంటి హీరోయిన్లు ఇలా గొడవ పడటం నాకు నచ్చడం లేదు అంటూ వర్మ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X