Ariyana Bold RGVపై తిట్లు ఆపండి.. చిల్ అవ్వండి.. ఫ్యాన్స్‌కు ఆర్జీవి మరో గుడ్ న్యూస్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, బిగ్‌బాస్ తెలుగు 4 ఫేమ్ అరియానా గ్లోరి కలిసి చేసిన Ariyana Bold RGV అనే ఇంటర్వ్యూ ప్రొగ్రాం ఇటీవల విడుదలై అనేక వర్గాల నుంచి ప్రశంసలతోపాటు మరికొన్ని వర్గాల నుంచి ప్రతికూల స్పందనలు, దూషణలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ క్రమంలో కొందరు వర్మను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఆర్జీవి స్పందిస్తూ...

Recommended Video

RGV Exclusive | 'I Don't Care Even My Fans' - Ram Gopal Varma
 అరియానాతో ఆర్జీవి ఇంటర్వ్యూ

అరియానాతో ఆర్జీవి ఇంటర్వ్యూ

ఇటీవల విడుదలైన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ, అరియానా గ్లోరి మధ్య సెక్స్ రిలేటెడ్ మాటలు వినిపించడం కొందర్ని జీర్ణించుకోలేకపోయాయి. దాంతో చాలా మంది ఆర్జీవి తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నీతో సెక్స్ చేస్తున్నా అంటూ, నాకు నీ యాస్ అంటే ఇష్టం అనే కామెంట్లు కొంచెం అసభ్యతకు చోటిచ్చాయనే వాదన సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ క్రమంలో రాం గోపాల్ వర్మ ఓ వీడియోను రిలీజ్ చేసి ఘాటుగా స్పందించాడు.

నేను అరియానా హ్యపీ

నేను అరియానా హ్యపీ

నాతో అరియానా గ్లోరి చేసిన ఇంటర్వ్యూ Ariyana Bold RGVకి నా ఛానెల్‌లో, అలాగే భలా ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో 40 లక్షల వ్యూస్ వచ్చాయి. అందుకు నేను, అరియానా చాలా హ్యాపీ. ఎవరెవరైతే ఆ ఇంటర్వ్యూ చూసి సంతోషపడని వారందరికి కూడా నా లవ్ అని రాంగోపాల్ వర్మ అన్నారు.

 మెచ్యురిటీ రావాలని వెయిట్ చేస్తుంటాం

మెచ్యురిటీ రావాలని వెయిట్ చేస్తుంటాం

అరియానా బోల్డ్ ఆర్జీవి ఇంటర్వ్యూ చూసి సంతోషపడని వారికి మా లాంటి మానసిక పరిపక్వత (మెచ్యురిటీ) రావడానికి చాలా సమయం పడుతుంది. వారికి మెచ్యురుటి రావడానికి వేచి చూస్తాం. అయినా వారికి ఆ పరిపక్వత రాకపోయినా అవసరం లేదు. ఇంటర్వ్యూ చూసి నెగిటివ్‌గా కామెంట్ చేసి ఏదేదో అయిపోయిందని అనుకొనే వారికి నేను ఉచిత సలహా ఇవ్వాలని అనుకొంటున్నాను అని వర్మ తెలిపారు.

జీవితాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి

జీవితాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి

అరియానా బోల్డ్ ఆర్జీవి లాంటి ఇంటర్వ్యూలు చూసి చిల్ అవ్వడం నేర్చుకోండి. జీవితాన్ని అంత సీరియస్‌గా తీసుకోకుండా హ్యాపీగా ఉండండి. దేవుడు ఇచ్చిన సంతోషాలను, ఇతర విషయాలను ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఇది మీ కోసం చిన్న జాన గుళిక.. అని వర్మ సెటైర్లు వేశారు.

మరో ఇంటర్వ్యూ వీడియోతో

ఇలాంటి సందర్భంగా అరియానా మిక్స్ ఆర్జీవి అని అదే వీడియో చిన్న చిన్న గిమ్మిక్కులు చేసి రిలీజ్ చేస్తున్నాం. ఆ వీడియోను చూసి ఆనందించండి. ఆనందించని వాళ్లు కూడా మళ్లీ చూసి ఏమైనా కామెంట్ చేయండి లేదా ఏదైనా తిట్టే, దూషించే ప్రొగ్రాం పెట్టండి. దాని వల్ల మాకు వ్యూస్ పెరుగుతాయి. అందుకు ముందుగా థ్యాంక్స్ చెబుతున్నాను అని వర్మ తనదైన శైలిలో వీడియోలో స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X