twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా మాటపై నమ్మకం లేకపోతే ఆ పని చెయ్! మరోసారి వార్తల్లో నిలిచిన రామ్ గోపాల్ వర్మ

    |

    విలక్షణం, వివాదాస్పదం రెండింటికీ కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. అందరూ ఓ రూట్‌లో ఆలోచిస్తే మనోడు మాత్రం నా రూటే సపరేటు అంటాడు. ఇకపోతే ఎప్పుడూ ఏదో ఒక స్పెషల్ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుండటం ఆయన హాబీ. ఈ నేపథ్యంలోనే తాజాగా కరోనా వైరస్‌పై తనదైన కోణంలో స్పందించి మరోసారి మీడియా వర్గాలకు పని చెప్పారు వర్మ. వివరాల్లోకి పోతే..

    కరోనా కలకలం.. జనంలో ఆందోళన

    కరోనా కలకలం.. జనంలో ఆందోళన


    ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. చైనా దేశంలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ క్రమేణా ప్రపంచ దేశాన్నింటికీ విస్తరిస్తుండటం ఆందోళన కలిగితోంది. ఇప్పటికే భారత దేశంలో కరోనా కేసులు గుర్తించబడటంతో ఈ వైరస్ గురించిన అవగాహన చర్యలు చేపడుతూ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నారు.

    కరోనా.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వర్మ

    కరోనా.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వర్మ


    కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న నేపథ్యంలో దేశ, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అయితే అందరిలో చాలా డిఫరెంట్‌గా స్పందించి వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ.

    మాతో పాటు నువ్వు కూడా చస్తావ్!

    మాతో పాటు నువ్వు కూడా చస్తావ్!

    ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా సందేశం పోస్ట్ చేసిన ఆయన.. ''‘డియర్ వైరస్, అందరినీ చంపుకుంటూ పోతే నువ్వు కూడా చచ్చిపోతావు అన్న విషయాన్ని తెలుసుకో. ఎందుకంటే నువ్వు కూడా ఓ పారసైట్‌వే. నా మాటపై నమ్మకం లేకపోతే వెంటనే వైరాలజీలో క్రాష్ కోర్స్ తీసుకో. కాబట్టి నీకు నేను నీకిచ్చే సలహా ఒక్కటే.. నువ్వు బతుకు, మమ్మల్ని బతకనివ్వు'' అని పేర్కొన్నారు.

    వర్మపై కౌంటర్లు.. నీకు కావాలంటే!


    దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. వర్మ గారూ వైరస్‌కి మీలాగా ట్విటర్ అకౌంట్ లేదుగా, కావాలంటే నేరుగా హాస్పిటల్‌కి వెళ్లి డైరెక్ట్‌గానే వార్నింగ్ ఇవ్వండి.. అంటూ వర్మకు కౌంటర్లు వేస్తున్నారు. ఏదేమైనా వర్మ తీరు మాత్రం మరోసారి ఆసక్తి కలిగించింది.

    Recommended Video

    Prabhas Spotted At Hyderabad Airport With Coronavirus Mask || Filmibeat Telugu

    అస్సలు ఊహించలేదు

    దీంతో పాటు మరో ట్వీట్ చేసిన వర్మ.. ''చివరికి మన చావు కూడా మేడ్ ఇన్ చైనా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు'' అని కామెంట్ చేశారు.

    English summary
    CoronaVirus entered in Hyderabd. Now Ram Gopal Varma commented on this virus using social media platform.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X