కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. మరో బాంబ్ పేల్చిన రామ్‌గోపాల్ వర్మ

ఎల్లప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. సినిమాలే గాక పలు ఇంటర్వ్యూల్లో సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించడం ఈయనకే సాటి. ఈ నేపథ్యం లోనే ఇటీవలే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈయన.. తిరిగి ఇప్పుడు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ మరో సెన్సేషన్‌కి రెడీ అయ్యాడు.

తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో ఏ మాత్రం కాంట్రవర్సీ లేదంటూ మొదటి నుంచే చెబుతూ వస్తున్న వర్మ.. ఇప్పటికే ఈ సినిమా అప్‌డేట్స్ రిలీజ్ చేసి ఆ సినిమాను చర్చనీయాంశం చేసేశాడు. కొందరు రాజకీయ పెద్దలను విమర్శిస్తున్నట్లుగా టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ బయటకు వదిలి సినిమాను హాట్ టాపిక్ చేశాడు. ఈ సినిమాపై, వర్మపై కేసు కూడా నమోదైంది. దీంతో అందరి చూపు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై పడింది.

Ram Gopal Varma Reaction On Kamma Rajyam Lo Kadapa Redlu Movie

ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సమావేశం నిర్వహించిన వర్మ.. తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా గురించి మరో బాంబ్ పేల్చాడు. ఈ సినిమా పూర్తి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పి షాకిచ్చాడు. తాను ఎవ్వరినీ టార్గెట్ చేయలేదని, అలాగే తనకు ఎవ్వరి దగ్గరి నుంచీ ఎలాంటి బెదిరింపులు రాలేదని వర్మ చెప్పాడు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో ఏ వర్గాన్ని తక్కువచేసి చూపించలేదని ఈ సందర్బంగా వర్మ పేర్కొన్నాడు. నవంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X