twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Porn Rocket కేసుపై ఆర్జీవి షాకింగ్‌గా.. పోర్నోగ్రఫి తప్పు కాదు.. అందుకే ఆ సబ్బుకు XXX పేరు అంటూ!

    |

    బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫి కేసులో ఇరుక్కు పోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పోర్నోగ్రఫి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారనే ఆరోపణలపై రాజ్ కుంద్రా అరెస్ట్ చేయడంతో అశ్లీలత, అసభ్య చిత్రాల నిర్మాణంపై చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పోర్నోగ్రఫి గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఓ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. రాంగోపాల్ వర్మ ఏమన్నారంటే..

    బాత్‌ టబ్‌లో నగ్నంగా సౌందర్య శర్మ.. మీరెప్పుడూ చూడని స్టన్నింగ్ ఫోటోలుబాత్‌ టబ్‌లో నగ్నంగా సౌందర్య శర్మ.. మీరెప్పుడూ చూడని స్టన్నింగ్ ఫోటోలు

    2 వేల సంవత్సరాల క్రితమే

    2 వేల సంవత్సరాల క్రితమే


    పోర్నోగ్రఫి అనేది 2 వేల సంవత్సరాల క్రితం నాటిది. రోమ్‌లో జరిగిన తవ్వకాల్లో కొన్ని పెయింటింగ్స్ బయటపడినప్పుడు పోర్న్ అనేది అప్పటి నుంచే ఉందనే విషయం బయటకు వచ్చింది. శృంగారం అనేది దేవుడు పెట్టిన అంశం. మనుషులు సృష్టించింది కాదు. పోర్న్ అనేది సినిమా గావొచ్చు. వెబ్ సిరీస్ కావొచ్చు. ఒక పెయింటింగ్ అయినా కావొచ్చు అని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.

    భీమ్లా నాయక్‌గా పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ రానా షూట్ ఫోటో వైరల్..భీమ్లా నాయక్‌గా పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ రానా షూట్ ఫోటో వైరల్..

    చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా

    చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా

    పోర్నోగ్రఫి చూడటం అనేది ఇప్పుడు అందరూ చూస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేదు. అమెరికాలో చేసిన అధ్యయనం ప్రకారం ఏడేళ్ల వయసు పిల్లలు కూడా పోర్న్ చిత్రాలు చూస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. అయితే పిల్లలు పోర్న్ చూసినంత మాత్రాన వాళ్లు చెడిపోతున్నారంటే నేను ఒప్పుకోను. పిల్లల్లో శృంగారం చేసే శక్తి, అవగాహన కలిగినప్పుడే సెక్స్‌పై ఆసక్తి పెరుగుతుంది. చిన్నతనంలో పోర్న్ చూస్తే దాని వల్ల సమాజానికి నష్టం లేదు అని రాంగోపాల్ వర్మ అన్నారు.

    ఓటీటీ చూడకండి.. అంటూ

    ఓటీటీ చూడకండి.. అంటూ

    ఓటీటీ ద్వారా పోర్నోగ్రఫికి ఆదరణ పెరుగుతున్నదని అంటే నేను ఒప్పుకోను. ఓటీటీ వల్లనే చెడిపోతున్నారని అనడం తప్పు. ఇష్టం ఉంటే చూడండి.. లేకపోతే ఓటీటీ చూడకండి. పోర్న్ చూడటం వల్ల సమాజానికి నష్టం జరగదు. ఆ పని జరిగిన తర్వాత వాడి పనేదో వాడు చూసుకొంటాడు. ఏదో ఒక చోట లైంగిక దాడులు జరిగి ఉంటాయి.. పోర్నోగ్రఫి చూసినంత మాత్రాన సమాజంలో రేప్, దారుణాలు జరగవని అని వర్మ అన్నారు.

    పోర్న్ చూస్తే నేరాల సంఖ్య తగ్గే అవకాశం

    పోర్న్ చూస్తే నేరాల సంఖ్య తగ్గే అవకాశం


    పోర్నోగ్రఫికి చట్టబద్దత కల్పిస్తే నేరాల సంఖ్య కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయనే విషయం తాజా అధ్యయానాల్లో వెల్లడయ్యాయి. చట్ట సభల్లో కూడా పోర్న్ చూస్తున్నాయనే విషయాలు మనం చూశాం. అంటే పోర్న్ చూడటం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. ఒకప్పడు గుట్టుచప్పుడుగా చూసే వాళ్లు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చాక పోర్నో చిత్రాలు అందరికి అందుబాటులోకి వచ్చాయి అని అన్నారు.

    రాజ్ కుంద్రా కేసు గురించి తెలియదు

    రాజ్ కుంద్రా కేసు గురించి తెలియదు

    రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిపై పెట్టిన పోర్నోగ్రఫి కేసు గురించి నేను స్పందించలేదు. ఎందుకంటే నాకు ఆ కేసు గురించి పూర్తి వివరాలు తెలియదు. అందుకే నేను ఆ కేసు గురించి నేను ట్వీట్లు చేయలేదు. పోర్నోగ్రఫి అనేది తప్పుకాదు. ఎవరినైనా బలవంతం చేస్తే అది తప్పు అని రాంగోపాల్ వర్మ అన్నారు.

    Recommended Video

    P Som Shekar, Ram Gopal Varma's Cousin Passes Away | Filmibeat Telugu
    సబ్బుకు అలాంటి పేరా? ఆర్జీవి ఆశ్చర్యం

    సబ్బుకు అలాంటి పేరా? ఆర్జీవి ఆశ్చర్యం

    సబ్బుకు XXX పేరు పెట్టడంపై రాంగోపాల్ వర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బహుశా దక్షిణాదికి సంబంధించిన వ్యాపారస్తులే ఆ పేరు పెట్టి ఉంటారని కామెంట్ చేశారు. అందర్ని ఆకర్షించడానికి XXX పేరు పెట్టి ఉంటారని.. సెక్స్ అనేది అంటరాని వస్తువు కాదని వాళ్లు కూడా నమ్మి ఉంటారేమో. సబ్బుల పేరు కూడా అలా పెట్టారంటే.. అందులో ఏదో మర్మాన్ని వాళ్లు గ్రహించి ఉంటారని వర్మ అన్నారు.

    English summary
    Ram Gopal Varma reacts on Raj kundra case: Pornography is not a wrong. OTT is are not encouraging the sex and voilence. RGV says, He will not comment on Raj Kundra Case
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X