"నువ్వెందుకు ఏడుస్తున్నావ్ శ్రీదేవీ!: మేం కదా ఏడవాలి"
హైదరాబాద్: అతి లోక సుందరి శ్రీదేవి మృతిపై దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ వరుసగా స్పందిస్తున్నారు. ఆమె మృతిపై వరుసగా ట్వీట్ చేస్తున్నారు. శ్దీదేవిని వర్మ ఆరాధిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే.
శ్రీదేవితో ఆయన క్షణక్షణం సినిమా తీశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోని ఫొటోలను ట్వీట్ చేస్తూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

వరుస ట్వీట్లతో వర్మ ఆవేదన
శ్రీదేవి మృతిపై దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో స్పందిస్తున్నారు. నిజంగా శ్రీదేవి చనిపోయారా, నన్ను ఎవరైనా నిద్ర లేపి ఇదొక చెడ్డ కల అని చెప్పండి అంటూ వర్మ అన్నారు. ఆమె ఇప్పుడే అలా వెళ్లిపోవడం ఎం నరకంగా ఉంటుందో ఎవరైనా చెప్పండంటూ మరో ట్వీట్‌లో అన్నారు. శ్రీదేవితో తాను ఉన్న ఫొటోను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు.

ఆ శ్రీదేవి పిక్ చేసి..
శ్రీదేవి క్షణక్షణం సినిమాలో కన్నీళ్లు పెట్టుకుంటున్న పిక్‌ను రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్య పోస్టు చేశారు. ‘నువ్వెందుకు ఏడుస్తున్నావు శ్రీదేవి? నువ్వు చేసిందానికి మేము కదా ఏడవాలి' అంటూ ట్వీట్ చేశారు.

చనిపోయినందుకు శ్రీదేవిని కూడా.
‘శ్రీదేవిని చంపేసినందుకు నేను దేవుణ్ని అసహ్యించుకుంటున్నాను. చనిపోయినందుకు శ్రీదేవిని కూడా అసహ్యించుకుంటున్నాను' అని మరో ట్వీట్ ద్వారా రామ్ గోపాల్ వర్మ అన్నారు.

ఎంత నరకంగా ఉంటుందో చెప్పండి..
‘ఆమె ఇప్పుడే అలా వెళ్లిపోవడం ఎంత నరకంగా ఉంటుందో ఎవరైనా చెప్పండి' అంతకు ముందు మరో ట్వీట్‌లో రామ్ గోపాల్ వర్మ అన్నారు. శ్రీదేవిని తన ఆరాధ్య దేవతగా ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. శ్రీదేవిని వివాహం చేసుకున్న బోనీకపూర్ అంటే నతకు చాలా కోపమని కూడా ఆయన హాస్యమాడిన సందర్భాలున్నాయి.


Click it and Unblock the Notifications











