twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ నైట్.. కడపలో మరో సంచలనానికి వర్మ నాంది!

    |

    దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన వివాదాస్పద సంఘటనల ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేసి తీరుతానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర రెండు ట్రైలర్స్ విడుదల చేశారు. ఆ రెండు ట్రైలర్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎన్టీఆర్ సింహగర్జన పేరుతో ఓ ఈవెంట్ ని కూడా వర్మ నిర్వహించారు. మార్చి 22 న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో మరో సంచలన కార్యక్రమానికి వర్మ శ్రీకారం చుట్టాడు.

    ఎన్టీఆర్ నైట్

    వర్మ ట్విట్టర్ లో పేర్కొంటూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ఆడియో లాంచ్ కడపలో భారీ బహిరంగ సభ ద్వారా చేయబోతున్నాం. ఈ ఈవెంట్ కు వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్ అని పేరు పెట్టాం. ఈవెంట్ నిర్వహించబోయే తేదీని అతి త్వరలోనే ప్రకటిస్తాం అని వర్మ తెలిపాడు. నిజంగా, నిజమైన ఎన్టీఆర్ అభిమానులకు ఈ ఈవెంట్ కోసం స్వాగతం పలుకుతున్నాం అని వర్మ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.

    మరో సంచలనం

    మరో సంచలనం

    ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఓ పార్టీకి లబ్ది చేకూర్చడానికి తీస్తున్నారనే విమర్శలని వర్మ ఎదుర్కొంటున్నారు. ఈ చిత్రం వెనుక వైసిపి హస్తం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కడపలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో వేడుక నిర్వహించనుండడం ఆసక్తిగా మారింది. ఆడియో వేడుకతో వర్మ మరో సంచలనానికి నాంది పలకబోతున్నారని అర్థం అవుతోంది.

    తీవ్రమైన ఆరోపణలు

    తీవ్రమైన ఆరోపణలు

    ఈ చిత్రాన్ని వర్మ పూర్తిగా లక్ష్మి పార్వతి కోణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ లో చూపిన విధంగా ఎన్టీఆర్ పాత్రతో సంచలన వ్యాఖ్యలు చేయించారు. అవి నేరుగా ఎన్టీఆర్ కురుంబ సభ్యులకే తగిలేలా ఉన్నాయి. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి దర్శత్వం వహించేందుకు ముందుగా వర్మకు అవకాశం వచ్చింది. కానీ చివరకు ఆ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించారు. ఆ చిత్రం నుంచి తప్పుకోవడం వల్లే తనకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రీకరించాలనే ఆలోచన వచ్చిందని వర్మ తెలిపారు.

    ఎలాంటి అడ్డంకులు లేవు

    ఎలాంటి అడ్డంకులు లేవు

    టిడిపి నేతలు ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలని ఎన్నికలు ముగిసే వరకు ఆపాలని ఫిర్యాదు చేశారు. దీనితో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు అడ్డంకులు తప్పవని అంతా భావించారు. ఎన్నికల సంఘం మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తేల్చి చెప్పింది. దీనితో ఈ చిత్ర విడుదలకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.

    English summary
    Ram Gopal Varma to release Lakshmi's NTR Audio in Kadapa
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X