లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్2: శ్రీదేవి లాంటి అందగత్తెలతో, దానిలో ఏముందని.. నా కొడుకు లోకేష్ మీద ఒట్టు
Recommended Video

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ని వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి ట్రైలర్ జనాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఆసక్తిని పెంచింది. తాజాగా వర్మ రెండవ ట్రైలర్ ని కూడా విడుదల చేశాడు. సెకండ్ ట్రైలర్ లో వర్మ ఇంకాస్త డోసు పెంచినట్లే కనిపిస్తున్నాడు. ట్రైలర్ లోని విశేషాలు ఇప్పుడు చూద్దాం!

వాళ్లే చంపేశారు
ట్రైలర్ ఆరంభంలో.. వాడూ.. నా పిల్లలే నన్ను చంపేశారు అనే ఎన్టీఆర్ స్టేట్ మెంట్ ని వర్మ చూపించాడు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. నేను నేను కాదు.. నా ప్రజలే నన్ను ఇంతటి వాడిని చేశారు. ఇప్పుడు వాళ్లే నన్ను వద్దనుకున్నారు. ఆ పవర్ ని వెనక్కి తీసేసుకున్నారు అంటూ ఎన్టీఆర్ మాటలతో ట్రైలర్ ఆరంభం అవుతుంది.

చాల మందితో ఎఫైర్స్
చంద్రబాబు ఎంట్రీ ఇచ్చి లక్ష్మి పార్వతి గురించి చెడుగా ఎన్టీఆర్ తో చెబుతాడు. మీరు అనుకుంటున్నట్లు ఆవిడ అంత మంచి మనిషి కాదు. ఇంతకు ముందే ఆవిడకు చాలా మందితో ఎఫర్స్ ఉన్నాయని.. అంటూ చంద్రబాబు డైలాగులు వినిపిస్తాయి. రామారావు గారు ఆయన్ని పెళ్లి చేసుకోమని అడిగారు అని లక్ష్మి పార్వతి అంటుంది. ఎన్టీఆర్ పునర్వివాహం అంటూ పత్రికల్లో వార్తలు వస్తాయి.
దానిలో ఏముందనో
ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మి పార్వతి ప్రవేశించడంతో ఆయన కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి. శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి మహా మహా అందగత్తెలతో పరిచయం ఉన్న ఆయనకి దానిలో ఏముందనో.. అని ఎన్టీఆర్ కుమార్తె అంటుంది. లక్ష్మి పార్వతికి ఎన్టీఆర్ కుమార్తెల నుంచి వేధింపులు మొదలవుతాయి. మీరు కొట్టినా, పొడిచినా, చంపినా నేను వచ్చింది ఆయనకు సేవ చేసుకోవడానికే అని లక్ష్మి పార్వతి చెబుతుంది.

పార్టీలో తిరుగుబాటు
లక్ష్మీపార్వతి వలన పార్టీలో వ్యక్తిరేకత మొదలవుతుంది. మనం పనికిరాని దద్దమ్మలు అనుకుంటున్నాడా అని చంద్రబాబు వర్గీయలు అంటారు. చంద్రబాబు, లక్ష్మీ పార్వతి మధ్య సాగే ఆసక్తికరమైన సంభాషణని చూపించారు. ఆయనకు ఏ హాని తలపెట్టనని హామీ ఇవ్వండి అని లక్ష్మీ పార్వతి అడుగుతుంది. నా కొడుకు లోకేష్ మీద ఒట్టు అని చంద్రబాబు చెబుతాడు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు చర్యలు ప్రారంభిస్తాడు. దానిని ఆపాలని నేను చేసే ప్రయత్నంలో మీ సపోర్ట్ 100 శాతం కావాలని బాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులని అడుగుతాడు.

వెన్నుపోటు
ఎన్టీఆర్ ని కీలుబొమ్మని చేసి ఆడిస్తోంది అంటూ అంతా లక్ష్మి పార్వతిపై నిందలు వేస్తారు. ఎన్టీఆర్ పై వ్యక్తిరేకత మరింతగా పెరుగుతుంది. అబద్దానికి నోరు పెద్దది, అన్యాయానికి చేతులు పెద్దవి అని ఎన్టీఆర్ ఆగ్రహంతో చెప్పే డైలాగ్ చూపిస్తారు. ట్రైలర్ చివర్లో వెన్నుపోటు అంటూ సాంగ్ ప్లే అవుతుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంద్వారా తాను సంచలన కంటెంట్ తోనే రాబోతున్నట్లు వర్మ ఈ ట్రైలర్ ద్వారా చెప్పాడు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, చంద్రబాబుకు పూర్తి వ్యతిరేకంగా ఈ చిత్రం తెరకెక్కుతోందనేది స్పష్టం.


Click it and Unblock the Notifications











