ఏసెయ్‌రా నా కొడుకుని.. మరిన్ని అనుమానాలకు నాంది పలుకుతూ వర్మ సంచలన పోస్ట్
వివాదాస్పద దర్శకుడు అనాలా? విలక్షణ దర్శకత్వం అనాలా? లేక గట్స్ ఉన్న డైరెక్టర్ అనాలా? అని అర్థంకాని ఏకైన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఏ సినిమా తీసినా అది డిఫెరెంట్ మూవీ అనిపించుకోవడం ఆయన స్టైల్. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ప్రేక్షకులను అలరించడంలో, ఎడ్యుకేట్ చేయడంలో వర్మది అందె వేసిన చేయి.

మరో డిఫెరెంట్ సినిమాతో..
ఈ నేపథ్యంలోనే తాజాగా `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` అంటూ మరో డిఫెరెంట్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు వర్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఏ మాత్రం కాంట్రవర్సీ లేదు అని చెబుతూనే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రాజకీయ వర్గాలకు చుక్కలు చూపిస్తున్నాడు వర్మ. ఈ సినిమా అప్‌డేట్స్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఏసెయ్‌రా నా కొడుకుని అంటూ
`కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు లుక్స్ వదిలి సంచలనం సృష్టించిన వర్మ.. సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సరికొత్త అనుమానాలకు తెరలేపారు. ''ఏసెయ్‌రా నా కొడుకుని'' అనే డైలాగ్ వస్తుండగా `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` టైటిల్ పై గొడ్డలి పెట్టు వేశాడు వర్మ. దీంతో ఆయన టార్గెట్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది.
అనుమానాలకు నాంది
ఈ మోషన్ పోస్టర్‌ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న వర్మ.. ''రక్త చరిత్రకి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి పెళ్లి చేస్తే పుట్టే పిల్లలే కమ్మ రాజ్యం లో కడప రెడ్లు'' అని ట్యాగ్ చేస్తూ మరిన్ని అనుమానాలకు నాంది పలికాడు.

మరింత వివాదాస్పదం కానున్నాడా..?
ఇటీవలే రాజకీయ నేపథ్యంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో వివాదాలు సృష్టించిన వర్మ.. ఇక `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` సినిమాతో మరింత వివాదాస్పదం కానున్నాడని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో రాజకీయ ప్రముఖులందిరి రోల్స్ పెట్టడంతో జనాల్లో ఎక్కడా లేని ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో!.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రెగ్యులర్ అప్‌డేట్స్
మొత్తానికైతే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ చాలా టెక్నిక్స్ ప్లే చేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. సరైన టైమ్‌ని, సరిగ్గా క్యాచ్ చేసుకుంటూ వర్మ ఇస్తున్న అప్‌డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











