Don't Miss!
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్: దానికి కానీ కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్.. మైండ్ బ్లోయింగ్!
Recommended Video
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జూలు విదిల్చాడు. తాను మనసుపెట్టి చేస్తే ఆ చిత్రం ఎలా ఉంటుందో నిరూపించాడు. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే వర్మ సరైన సబ్జెక్ట్ దొరికితే తన దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంటుందో తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా నిరూపించాడు. రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ ని కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్జీవీ బలమైన భావోద్వేగాలతో కేక పెట్టించాడు. ట్రైలర్ లోని విశేషాలు ఇప్పుడు చూద్దాం!
ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తర్వాత
నమ్మితేనే కదా ద్రోహం చేసేది.. అడవిరాముడు సినిమాలో ఓ డైలాగ్ అంటూ టైటిల్ కార్డుతో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తర్వాత రోజులవి అంటూ ఎన్టీఆర్ పాత్రలో ఉన్న వ్యక్తి టెలిఫోన్ పట్టుకుని కనిపిస్తారు. బ్యాగ్రౌండ్ లో రామ.. రామ అనే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ చాలా దిగులుగా కనిపిస్తారు. కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ని విడచి వెళ్లిపోతుంటారు. వర్షం పడుతున్న రాత్రి సమయంలో ఎన్టీఆర్ ఒంటరిగా కుర్చీలో కూర్చుని ఉంటారు. అప్పుడే లక్ష్మీ పార్వతి ఎంట్రీ..
ఫోన్లో మాట్లాడింది నేనే స్వామి
కాలి గొలుసులు సవ్వడితో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆయన పాదాలకు నమస్కరించి.. స్వామి రాత్రి ఫోన్ లో మాట్లాడిన లక్ష్మి పార్వతిని నేనే అని పరిచయం చేసుకుంటుంది. అప్పటి నుంచి వీరిద్దరూ ఒకరికొకరు తోడు నీడగా జీవించడం ప్రారంభిస్తారు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ పాదాల చెంత కూర్చుకుని ఉండగా.. జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరికి అర్థం కాదు అని ఎన్టీఆర్ అంటారు. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ దగ్గరే ఉంటూ ఆయనకు సేవలు చేయడం ప్రారంభిస్తుంది.
పుకార్లు ప్రారంభం
అప్పటి నుంచే ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి రిలేషన్ గురించి అనేక పుకార్లు వ్యాపిస్తాయి. రాత్రులు కూడా అక్కడే ఉంటోందట అనే డైలాగ్ బ్యాగ్రౌండ్ లో వినిపిస్తుంది. లక్ష్మీ పార్వతి టిడిపి పార్టీ ఆఫీస్ లోకి కూడా ప్రవేశించి ఆయనకు మరింత చేరువ అవుతుంది. అదే సమయంలో దర్శకుడు చంద్రబాబు పాత్రని పరిచయం చేశారు. ఈవిడ పేరు లక్ష్మీ పార్వతి.. మా జీవిత చరిత్ర రాస్తున్నారు అని ఎన్టీఆర్ ఆమెని చంద్రబాబుకు పార్టీ నాయకులకు పరిచయం చేస్తారు.
పార్టీలో ఆడపెత్తనం
ఈ సంఘటనతో లక్ష్మీ పార్వతి రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. టిడిపి పార్టీలో సంచలనం సృష్టిస్తున్న ఓ స్త్రీ, పార్టీలో ఆడపెత్తనం అంటూ పత్రికల్లో కథనాలు వస్తాయి. ఈ వార్తల పట్ల లక్ష్మీ పార్వతి కలత చెందుతుంది. ఏంటి ఇది స్వామి అని కన్నీరు పెట్టుకుంటూ ఎన్టీఆర్ ని అడుగుతుంది. దీనితో ఎన్టీఆర్.. లక్ష్మీ పార్వతితో ఉన్న సాన్నిహిత్యాన్ని అధికారికంగా మీడియా సమావేశంలో ప్రకటిస్తారు.
చంద్రబాబు వాయిస్
అప్పుడే ఎన్టీఆర్ కుటుంబంలో ఆయనపై ఆగ్రహం పెరుగుతుంది. దానికి కానీ కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్.. అంటూ చంద్రబాబు వాయిస్ తో డైలాగ్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ కుమార్తె ఒకరు లక్ష్మి పార్వతిని చెంపదెబ్బ కొట్టే సన్నివేశం వస్తుంది. మా జీవితాలని నాశనం చేయడానికి దాపురించావే ముండా నువ్వు అని లక్ష్మి పార్వతిని దూషిస్తుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు లక్ష్మి పార్వతి విషయంలో ఆయన్ని నిలదీస్తారు.. ఈ వయసులో కూడా మీకు ఆడతోడు అవసరం అంటే.. అని హరికృష్ణ అనగానే.. రేయ్ అంటూ ఎన్టీఆర్ ఆగ్రహంతో కుర్చీలోనుంచి లేస్తారు.
భావోద్వేగాలు
చంద్రబాబుకు సంబంధించిన సన్నివేశాలు, అనేక భావోద్వేగ సన్నివేశాలని దర్శకుడు వర్మ ఈ ట్రైలర్ లో చూపించాడు. ఈ క్రమంలో లక్ష్మి పార్వతికి టిడిపిలో రోజురోజుకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆ సన్నివేశాలలో చంద్రబాబుని వర్మ నెగిటివ్ షేడ్స్ లో చూపించాడు. అప్పుడే దర్శకుడు ఎమోషన్ ని కూడా తారాస్థాయికి చేర్చాడు. ఎన్టీఆర్ పై చెప్పులు విసిరే వైస్రాయ్ హోటల్ సంఘటనని చూపించాడు.
ఫినిషింగ్ అదుర్స్
జరుగుతున్న పరిణామాలతో ఎన్టీఆర్ పూర్తిగా కుంగిపోతారు. ఆయన రోగ్యం కూడా క్షీనిస్తుంది. తమ్ముళ్లు వాడి మాట వినకండి అని వేడుకుంటున్నా ఎన్టీఆర్ అపి చెప్పుల వర్షం కురుస్తుంది. ఎన్టీఆర్ చుట్టూ కొందరు మాత్రమే సన్నిహితులు మిగులుతారు. చివర్లో ఎన్టీఆర్ డైలాగ్ ని దర్శకుడు హైలైట్ చేశాడు. నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం అని అనగానే బ్యాగ్రౌండ్ లో దగా అనే వాయిస్ వినిపిస్తుంది. మొత్తంగా ఆర్జీవీ లక్ష్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ తో అదరగొట్టేశాడు. ఈ ఒక్క ట్రైలర్ తో చిత్రంపై అంచనాలు అమాంతం పెరగడం ఖాయం.